Begin typing your search above and press return to search.
విశాఖ వద్దని జీఎస్ రావు కమిటీ చెప్పిందా?
By: Tupaki Desk | 29 Jan 2020 4:35 AM GMTవిశాఖను పరిపాలనా రాజధానిగా పేర్కొన్నట్లుగా జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక చెప్పినట్లుగా వివరాలు బయటకు వచ్చాయి. అయితే.. ఈ నివేదికకు సంబంధించి సంచలన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయటానికి ఉన్న సానుకూలతల్ని ప్రస్తావించిన జీఎన్ రావు కమిటీ.. ప్రతికూలతల్ని కూడా పక్కాగా పేర్కొనటం గమనార్హం. కాకుంటే.. విశాఖ రాజధానిగా పాజిటివ్ లు మాత్రమే బయటకొచ్చి.. నెగిటివ్ రిమార్క్స్ మాత్రం చర్చకు రాలేదు.
ఆయన నివేదికలోని పలు కీలకాంశాలు తాజాగా బయటకు వచ్చాయి. సెక్రటేరియట్.. సీఎం క్యాంపు కార్యాలయం.. హైకోర్టు బెంచ్.. అసెంబ్లీలను విశాఖలోనే ఏర్పాటు చేయాలన్న సిఫార్సుతో పాటు.. ముఖ్యమైన కార్యాలయాల్ని సముద్రానికి వీలైనంత దూరంలో ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ పేర్కొనటం గమనరా్హం.
విశాఖలో ఉన్న పారిశ్రామిక.. నీటి కాలుష్య సమస్యల్ని ప్రస్తావించటంతో పాటు.. తగినంత భూమి అందుబాటులో లేకపోవటాన్ని ప్రస్తావించింది.. భోగాపురంలో ప్రతిపాదిన విమానాశ్రయ ప్రాంతంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్న విషయాన్ని పేర్కొంది. కమిటీ పేర్కొన్న ముఖ్యాంశాల్ని చూసినప్పుడు..విశాఖకు తుపాన్ల ముప్పుతో పాటు కోస్టర్ రెగ్యులేటరీ జోన్ పరిమితులు ఉన్న విషయాన్ని గుర్తు చేసింతి. తీరం కోతకు గురి కావటం లాంటి సమస్యల్ని ప్రస్తావించింది.
విశాఖ అన్నంతనే గుర్తుకు వచ్చే సముద్రం కారణంగా భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారటంపై ఆందోళన వ్యక్తం చేయటంతోపాటు ఉక్కు కర్మాగారం.. పోర్టు సంబధిత కార్యకలాపాల కారణంగా పారిశ్రామిక కాలుష్య సమస్యలున్న విషయాన్ని గుర్తు చేసింది. తూర్పు నౌకాదళ కేంద్రం ఉన్న నేపథ్యంలో.. అణు జలాంతర్గాములకు ఇది కేంద్రం కావటంతో భద్రతా పరమైన సమస్యలున్నట్లుగా పేర్కొంది. ఇక్కడున్న పరిమితుల కారణంగా కొత్తగా పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభించటం అవాంఛనీయమని వెల్లడించింది.
విశాఖ నగరం చుట్టు పక్కల భూముల లభ్యత తక్కువేనని.. ఇప్పటికే చాలా సంస్థలు భూ కేటాయింపు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విషయాన్ని వెల్లడించింది. జోన్ 1లో వచ్చే విశాఖలో భారీ పరిశ్రమలు.. పోర్టులు ఉన్నందున గాలి నాణ్యత క్షీణిస్తోంది. రాష్ట్రంలోని తీర ప్రాంతానికి తుపానులు.. పెను గాలులు.. ఉప్పెనలతో ప్రమాదం పొంచి ఉంది. గడిచిన దశాబ్దంలో ఏపీ తీరాన్ని తాకిన తుపానుల సంఖ్య.. తీవ్రత బాగా పెరిగింది. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఈ ప్రమాదం మరింత పెరిగే వీలుంది. ప్రతి రెండేళ్లలో ఒక తీవ్రమైన తుపాను ఏపీని తాకటంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది.
నెల్లూరు.. ఒంగోలు.. మచిలీపట్నం..కాకినాడ.. రాజమహేంద్రవరం.. విశాఖ.. శ్రీకాకుళం.. విజయనగరాలకు తీవ్ర తుపాన్లు.. ఉప్పెనల ప్రమాదం పొంచి ఉంది. వీటితో పోల్చినప్పుడు విశాఖ పరిస్థితి కాస్త మెరుగు. తీర ప్రాంత స్వభావం.. భౌగోళిక పరిస్థితుల కారణంగా మిగిలిన పట్టణాలతో పోలిస్తే విశాఖకు కాస్త రక్షణ ఎక్కువ. ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. హుధూద్.. తిత్లీ తుపానులతో జరిగిన నష్టాన్ని విశ్లేషించాలి. భవిష్యత్తులో ఇలాంటి తుపానులు వస్తే జరిగే ప్రాణ.. ఆస్తి నష్టాల్ని అంచనా వేసేందుకు సాయంగా ఉంటుంది.