Begin typing your search above and press return to search.
రాజధాని కమిటీ రిపోర్ట్ వచ్చేసింది!
By: Tupaki Desk | 20 Dec 2019 2:34 PM GMTవిశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన ఏపీ రాజధాని ఎంపిక - అభివృద్ధి కమిటీ పరిశోధన పూర్తిచేసి నివేదికను ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అందజేసింది. అనంతరం ఇందులోని ముఖ్యాంశాలను వారు మీడియాకు వివరించారు. సంపూర్ణ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా పరిశీలన జరిపి ప్రభుత్వానికి వ్యయభారం లేకుండా సూచనలు చేసినట్టు నిపుణల కమిటీ పేర్కొంది. ప్రజల భాగస్వామ్యం ఉండేలా - ప్రజలకు అందుబాటులో ఉండేలా - అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా ఆలోచించి సూచనలు చేసినట్టు కమిటీ వెల్లడించింది. సెప్టెంబర్ 13న నియమించిన ఈ కమిటీ... రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,600 కిటోమీటర్ల ప్రాంతం ప్రయాణించి భిన్నవర్గాల అభిప్రాయాలను సేకరించింది. గతంలో కేంద్రం ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా ఈ కమిటీ పరిశీలించడం గమనార్హం.
నిపుణుల కమిటీ సిఫారసుల్లో ముఖ్యాంశాలు...
1. అమరావతి - మంగళగిరిలో హైకోర్టు బెంచ్ - శాసనసభ - ప్రభుత్వ క్వార్టర్లు - గవర్నర్ క్వార్టర్స్ ఇక్కడే ఉంచాలి.
2. నాగార్జున యూనివర్సిటీ పరిసరాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆ భూముల్లో ప్రభుత్వం ఐకానిక్ భవనాలు నిర్మించుకోవడానికి అవకాశం ఉంది.
3. అమరావతిలోని వరదలు వచ్చే ప్రాంతాలను విస్మరించి మిగతా ప్రాంతాల్లోనే నిర్మాణాలు చేయాలి.
4. విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. అసెంబ్లీ వేసవి సమావేశాలు నిర్వహించాలి. సచివాలయం - సీఎం క్యాంప్ ఆఫీసు కూడా అక్కడే నిర్మించాలి.
5. శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలని ఎప్పటి నుంచో రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్నారు. దాన్ని పరిగణలోకి తీసుకుని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి.
6. పరిపాలనా సౌలభ్యం కోసం కర్ణాటక తరహాలో కమిషనరేట్ విధానాన్ని అవలంభించి ఏపీని నాలుగు రీజియన్లు విభజించి పాలనా సౌలభ్యం ఉండేలా చూడాలి. ఉత్తర కోస్తా (శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం) - మధ్య కోస్తా (ఉభయ గోదావరి - కృష్ణా జిల్లాలు) - దక్షిణ కోస్తా (గుంటూరు - ప్రకాశం - నెల్లూరు) - రాయలసీమ (కర్నూలు - కడప - చిత్తూరు - అనంతపురం)గా పరిపాలన విభజన చేసుకోవడం పాలన సులువవుతుంది.
7. ఇప్పటికే తుళ్లూరు ప్రాంతంలో ప్రభుత్వం చాలా పెట్టుబడలు పెట్టింది. అది వదిలేస్తే కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము వృథా అవుతుంది. కాబట్టి దాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి.