Begin typing your search above and press return to search.
వివక్ష తిక్క అమెరికాను దాటి ఐర్లాండ్ కి చేరింది
By: Tupaki Desk | 20 April 2017 7:20 AM GMTకొన్ని దరిద్రాలు అస్సలు మొదలే కాకూడదు. కానీ.. ఒకసారి మొదలయ్యాక వాటిని ఆపటం అంత తేలిక కాదు. మంచిని పెంచటం కష్టం కానీ.. చెడును పాకించటం చాలా ఈజీ అని చెప్పే మాటకు తగ్గట్లే అమెరికాలో ఈ మధ్య విచ్చల విడిగా మారిన జాతివివక్ష పైత్యం.. పక్కదేశాలకూ పాకుతోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పవర్ లోకి వచ్చిన నాటి నుంచి విదేశీయుల మీద అమెరికన్లు విరుచుకుపడుతున్న వైనం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
జాతివివక్షతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఈ తీరు.. ఇప్పుడు పక్కదేశాలకూ పాకుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఐర్లాండ్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక భారతీయుడిపై ఐరీష్ మహిళ విరుచుకుపడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ దేశంలోని లైంరిక్ అనే ప్రాంతంలో రైల్లో ప్రయాణిస్తున్న మనోడు.. ఖాళీగా ఉన్న సీట్లో తన బ్యాగ్ పెట్టాడు. అంతే.. ఆ ఎదురు సీట్లో కూర్చున్న ఐరిష్ మహిళ తిట్ల దండకాన్ని ఎత్తుకుంది. నువ్వు ఇండియాకు తిరిగి వెళ్లిపో.. నాలుగు సీట్లకు నువ్వు ఏమైనా డబ్బులు ఇచ్చావా? ముందు నా దేశానికి గౌరవం ఇవ్వు అంటూ సీరియస్ అయ్యింది.
అర్థం పర్థం లేకుండా మండిపడుతున్న ఆ మహిళ తీరును అక్కడి మరో ప్రయాణికుడు సరిదిద్దే ప్రయత్నం చేయగా.. వారి మీదా ఆ మహిళ మండిపడింది. నన్ను ఓల్డ్ లేడీ అంటావా? అంటూ తిట్ల దండకం అందుకున్న ఆమె.. జాతి వివక్షతో వ్యాఖ్యలు చేశారు. దీంతో బిక్కచచ్చిపోయిన భారతీయ యువకుడు మరో బోగీకి వెళ్లిపోయాడు. ఈ మొత్తం తతంగాన్ని ట్విట్టర్ వినియోగదారుడు ఒకరు వీడియో తీశారు. వివక్షతో ఇష్టారాజ్యంగా తిట్టే ఐరీశ్ మహిళ తిట్ల దండకం ఎంత భారీగా ఉందంటే.. మొత్తం ఫీడ్ 16 నిమిషాల పాటు ఉందంటే.. ఆమె ఎంత రచ్చ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని చెప్పక తప్పదు. ఇక.. వివక్షతో నోరు పారేసుకున్న ఐరీశ్ మహిళ తీరును సోషల్ మీడియాలో పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/