Begin typing your search above and press return to search.
ఆ 'జీవో' మండిపోయింది.. భగభగమంటూ బూడిదైంది!
By: Tupaki Desk | 14 Jan 2023 10:30 AM GMTవైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జీవో 1/2023 మండిపోయింది! శనివారం నాటి భోగి మంటల్లో భగ భగ మంటూ కాలి.. బూడిదైంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్యర్యంలో భోగి వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎక్కడికక్కడ నాలుగు రోడ్ల చౌరస్తాల్లో భోగి మంటలు వేశారు. అయితే.. ఈ మంటల్లో పాతసామాన్లతోపాటు.. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ కాపీలను వేసి దహనం చేశారు.
అవసరం లేని వస్తువులను తగలబెట్టినట్లు.. అవసరం లేని చీకటి జీవోను మంటల్లో వేసినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతల, పార్టీల గొంతు నొక్కడానికే ప్రభుత్వం జీవో నెంబర్ వన్ను తీసుకువచ్చిందని ఆరోపించారు. జీవో నెంబర్ వన్కు రద్దు చేయాలని నిరసనగా.. భోగి పండగ రోజు టీడీపీ నేతలు జీవో నెంబర్ వన్ కాపీలను భోగి మంటల్లో వేసి కాల్చారు.
విజయవాడలోని టీడీపీ అధ్వర్యంలో భోగి మంటలు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అశోక్ బాబు ఈ భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటల్లో జీవో నెంబర్ వన్ కాపీలను దగ్ధం చేశారు. భోగి పండగ రోజున పనికి రాని వస్తువులను భోగి మంటల్లో కాల్చటం ఆనవాయితీ అని.. జీవో నెంబర్ వన్ పనికిరానిదని అందుకే భోగి మంటల్లో దహనం చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలో సైకో జగన్ పాలన పోయి.. సైకిల్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడి వన్ సెంటర్లో భోగి వేడుకలలో మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటలలో జీవో నెంబర్ వన్ ప్రతులను దగ్ధం చేశారు. బ్రిటిష్ కాలం నాటి చీకటి చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ నాయకులు జీవోప్రతులను దహనం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.