Begin typing your search above and press return to search.
నిత్య 'గాయ'కుడు జడేజా.. సాహసానికి పోయి చేటు.. బీసీసీఐ ఆగ్రహం
By: Tupaki Desk | 10 Sep 2022 9:14 AM GMTటీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచ కప్ నకు అందుబాటులో ఉండనట్లే...? మోకాలి గాయంతో జడేజా ఆసియా కప్ లో రెండు మ్యాచ్ ల అనంతరం తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత జడేజా గాయానికి సర్జరీ జరిగింది. వాస్తవానికి చిన్న గాయమే అనుకున్నప్పటికీ సర్జరీ వరకు రావడంతో పెద్దదేనని తేలింది. దీంతో టి20 ప్రపంచ కప్ వంటి అత్యంత కీలక టోర్నీకి జడేజా స్థాయి ఆటగాడు దూరం కావాల్సిన పరిస్థితి. ఇక్కడ అసలు విషయం ఏమంటే జడేజా తనంతట తానే గాయం చేసుకున్నాడు. దీనిపై బీసీసీఐ ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో ఉంది.
అతడి సేవలు లేక.. చేజారిన ఆసియా కప్ ఆసియా కప్ లో రెండు మ్యాచ్ ల అనంతరం టీమిండియా పటిష్ఠంగా కనిపించింది. జడేజా కూడా రాణించడంతో మనదే కప్పు అనంత నమ్మకం కలిగింది. అయితే, అనూహ్యంగా సూపర్ 4 దశకు జడేజా దూరమయ్యాడు.
ఈ ప్రభావం పాకిస్థాన్ తో మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది. పోనీలే అనుకుంటే శ్రీలంక తో మ్యాచ్ లో పెద్ద దెబ్బే పడింది. ఏకంగా కప్ దూరమైంది. అదే జడేజా అందుబాటులో ఉండుంటే ఈ రెండు మ్యాచ్ ల్లో ఏదో ఒక దానిలో అయినా టీమిండియా నెగ్గేది. ఫైనల్ కు కచ్చితంగా వెళ్లేది. అంతెందుకు..? లీగ్ దశలో పాకిస్థాన్ పై జడేజా ప్రదర్శననే చూస్తే 35 పరుగులు చేయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి కీలక పాత్ర పోషించాడు. దీన్నిబట్టే చెప్పొచ్చు జడేజా ఎంతటి కీలక ఆటగాడో..?
విశ్రాంతి తీసుకోమంటే..ఆసియా కప్ లీగ్ దశలో రెండు మ్యాచ్ లు ముగిశాక టీమిండియాకు కాస్త విశ్రాంతి దొరికింది. ఆ సమయంలో ఆటగాళ్లు కోచ్ ద్రవిడ్ సూచనతో హోటల్ వెనుక ఉన్న బ్యాక్ వాటర్ లో
సరదాగా గడిపారు. అయితే, జడేజా మాత్రం స్కీ బోర్డుపై విన్యాసాలు చేసినట్లు తెలిసింది. దీంతోనే అతడి మోకాలికి గాయమైంది. అంటే.. మైదానంలోనో, నెట్ ప్రాక్టీస్ లోనో జడేజా గాయపడలేదని స్పష్టమవుతోంది. మరోవైపు ఈ ఘటనపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఎ గ్రేడ్ కాంట్రాక్టు ఆటగాడైన జడేజా ఇలా చేయడంపై మండిపడుతున్నట్లు తెలిసింది.
విచారణకు బీసీసీఐ ఆదేశ? జడేజా జట్టుకు ఎంతో కీలకం. అంతేగాక టి20 ప్రపంచకప్‌లో అతడు ఆడటం ఎంతో అవసరం. అదికూడా ఆస్ట్రేలియా వంటి చోట జరిగే ప్రపంచ కప్ లో జడేజా సేవలు అత్యవసరం. కానీ, అతడేమో మోకాలికి గాయం చేసుకుని కూర్చున్నాడు. కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని స్పష్టమవుతోంది. అందుకనే బీసీసీఐ ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నారని
విచారణకు ఆదేశించే అవకాశముందని ఓ పత్రికలో వచ్చింది. పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్‌కు ముందు హోటల్‌లో శిక్షణలో భాగంగా జడేజాకు నీళ్లలో సాహస క్రీడలా సాగే శిక్షణ ఇచ్చారని.. ఆ క్రమంలోనే అతడు గాయపడ్డాడని తెలుస్తోంది. అసలు శిక్షణ కార్యక్రమంలో భాగం కాని సాహసం అతడితో చేయించారని, అది సరిగా చేయలేక కిందపడిన జడేజాకు మోకాలి గాయమైందని సమాచారం.
వరుసగా గాయాలేనా..? జడేజా గత మూడేళ్లుగా జట్టులో అత్యంత నమ్మదగ్గ ఆటగాడిగా ఎదిగాడు. బ్యాట్ తో విలువైన పరుగులు, బంతితో కీలక వికెట్లు, మెరుపు ఫీల్డింగ్ తో పరుగులు ఆపుతూ రనౌట్లు చేస్తూ
ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే, గాయాలు అతడిని వెంటాడుతున్నాయి. తాజాగా జరిగినది చేతులారా చేసుకున్నదే అయినా.. ఇంతకుముందు జరిగినవి మాత్రం ఆటలోనో, ప్రాక్టీస్ లోనివో. గత నెలలో జరిగిన వెస్టిండీస్ టూర్ కు సైతం జడేజా ఇలానే గాయంతో దూరమయ్యాడు. గతేడాది కూడా గాయాలతో కొంత ఇబ్బంది పడ్డాడు. దీన్నిబట్టి అతడి విషయంలో ఆచితూచి వ్యవహరించడం బీసీసీఐ తీసుకోవాల్సిన తక్షణ చర్య.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.