Begin typing your search above and press return to search.
లంచం కేసులో సీఎం బావమరిది అరెస్టు
By: Tupaki Desk | 20 Aug 2015 5:35 AM GMTలంచం కేసులో సాక్షాత్తు సీఎం బావమరిది ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పరేకర్ బావమరిది దిలీప్ మూల్యాంకర్ రాష్ర్ట పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. ఆయన ముంబై ఇండస్ర్టీయల్ ఎస్టేట్ లో ఓ ప్లాట్ కేటాయింపునకు రూ.లక్ష లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై పోలీసులు ఆయన్ను మంగళవారం అరెస్టు చేశారు.
ఈ కేసులోదిలీప్ ముల్యాంకర్ తో పాటు అక్కడ పనిచేసే మరో అధికారి అజీత్ గోమేకర్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. తన బావమరది అరెస్టుపై సీఎం పరేకర్ స్పందించారు. మూల్యాంకర్ తన బంధువైనా ఈ కేసు విషయంలో తానేమి జోక్యం చేసుకోనని చెప్పారు. ఈ కేసు ద్వారా లంచం విషయంలో ఎంతటి వారికైనా శిక్ష తప్పదన్న ఉదంతం తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోనని ముందే ప్రకటించడం ద్వారా ప్రతిపక్షాల నుంచి ఎటువంటి విమర్శలు రాకుండా జాగ్రత్తపడినట్లయ్యింది.