Begin typing your search above and press return to search.
డీల్ కుదిరింది..మరో రాష్ట్రంలో బీజేపీ సర్కార్
By: Tupaki Desk | 13 March 2017 6:39 AM GMTగోవాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అధినాయకత్వం వేసిన వ్యూహాలు ఫలించాయి. గోవా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి మనోహర్ పారికర్‌ను గోవా గవర్నర్ మృదులా సిన్హా నియమించారు. 15 రోజులలోగా శాసనసభలో పారికర్ తన మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ సమక్షంలో మంత్రాంగం సాగింది. చిన్న పార్టీలను ఒప్పించడమే కాకుండా వారికి మంత్రి పదవులు ఇస్తామనే డీల్‌ను సైతం గడ్కరీ కుదిర్చారు.
ఈ చర్చల అనంతరం గవర్నర్ మృదులా సిన్హాను మనోహర్‌పారికర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తనకు కావాల్సిన మోజార్టీ ఉందని చెబుతూ 22 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేశారు. గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 21 మంది అభ్యర్థుల మద్దతు కావాల్సి ఉంది. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ 13 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఏ పార్టీకి స్పష్ట మెన మెజార్టీ రాకపోవడంతో మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీకి చెందిన ముగ్గురు, గోవా పార్వర్డ్ ఫ్రంట్ నుంచి ముగ్గురు, స్వతంత్ర్య అభ్యర్థులు బీజేపీకి మద్దతు ప్రకటించారు. అనంతరం వారి సంతకాలను తీసుకొని పారికర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్‌ను కలిశారు. దీంతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉండగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కాగా బీజేపీ చర్యలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ తప్పుబట్టారు. ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు మెజార్టీ లేకున్నా బీజేపీ స్వారీ చేయాలని చూస్తోందని విమర్శించారు. ఇలాంటి ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యలని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 21 మంది అభ్యర్థుల బలం ఉంటే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని అందుకే తాము ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదని దిగ్విజయ్ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/