Begin typing your search above and press return to search.

గోవాకు వెళుతున్నారా?అయితే ఇది చదవాల్సిందే

By:  Tupaki Desk   |   7 Oct 2016 4:32 AM GMT
గోవాకు వెళుతున్నారా?అయితే ఇది చదవాల్సిందే
X
ఫ్యామిలీలు పక్కన పెట్టేసి.. నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే మదిలో మెదిలే డెస్టినేషన్ గోవానే. పార్టీయింగ్ కి.. ఎంజాయ్ మెంట్ కు గోవాకు మించిన ప్లేస్ మరొకటి లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. వీకెండ్స్ లో అక్కడికి వెళ్లి మజా చేస్తే.. ఆ హుషారే వేరని ఫీలయ్యేవారి సంఖ్య చాలానే ఉంటుంది. గోవా బీచ్ ల వెంట తిరగటం.. ఆ బ్యూటీ సిటీలో నచ్చిన చోట నాలుగు కుర్చీలు వేసుకొని మందుకొట్టి ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుందని మురిసిపోతుంటారు.

అయితే.. ఇలాంటివన్నీ గతం కానున్నాయి. ఇష్టం వచ్చినట్లుగా ఎంజాయ్ చేయాలని ఫీల్ అయ్యే వారిపై ‘‘ఫైన్’’ విదల్చటానికి సిద్ధమైపోయింది గోవా సర్కారు. తాగుడు వ్యవహారంతో గోవా ఇమేజ్ డ్యామేజ్ కావటమే కాదు.. ఫ్యామిలీలు వచ్చి ఎంజాయ్ చేసేందుకు వెనకాడుతున్నారని గోవా సర్కారు డిసైడ్ అయ్యింది. అంతేకాదు.. జనావాసాలు.. చారిత్రక వారసత్వ ప్రదేశాలు.. ప్రార్థనా స్థలాలు లాంటివి చూసుకోకుండా.. ఇష్టారాజ్యంగా తాగేస్తున్న వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గోవా సర్కారు భావిస్తోంది.

మందుబాబు పుణ్యమా అని.. గడిచిన కొన్నేళ్లుగా అసభ్య ప్రవర్తనతో పాటు.. తాగి పడేసిన సీసాలు.. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పర్యావరణం సైతం కలుషితం అవుతుందన్న కంప్లైంట్ రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో.. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని గోవా సర్కారు డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా ఎక్కడ పడితే అక్కడ తాగే విషయంపై పరిమితులు విధించటమేకాదు.. అలా చేసిన వారిపై భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించారు. నవంబరు నెల నుంచి అమలు కానున్న కొత్త రూల్స్ ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తాగే వీలు ఉంటుంది. నిషేధిత ప్రాంతాల్లోకానీ మద్యపానం చేస్తే.. అలాంటి వారిపై రూ.వెయ్యి నుంచి రూ.10వేల వరకూ ఫైన్ విధించాలని నిర్ణయించారు. ఇకపై.. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్ని నో ఆల్కహాల్ కన్సంప్షన్స్ జోన్స్ గా చేసి.. అక్కడ మద్యపానాన్ని నిషేధిస్తారు. గోవాను ఫ్యామిలీ టూరిజం ప్లేస్ గా మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెప్పొచ్చు. సో.. ఇష్టారాజ్యం ఎంజాయ్ మెంట్ కోసం గోవా వెళ్లాలనుకునే వారు.. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/