Begin typing your search above and press return to search.

గోవాలోనూ మందుపై కంట్రోలా?

By:  Tupaki Desk   |   16 April 2017 11:20 AM GMT
గోవాలోనూ మందుపై కంట్రోలా?
X
గోవా పేరెత్తితే చాలు చాలామంది నాలుక చప్పరిస్తారు. ఇండియాలో మద్యానికి అంతగా ఫేమస్ అయిన ప్రాంతం ఇంకోటి లేదు. అక్కడ రిస్ట్రిక్షన్స్ తక్కువ... దాంతో ఎక్కడెక్కడి నుంచో వస్తారు. విదేశీ పర్యాటకులు కూడా గోవా అంటే తెగ ఇష్టపడతారు, సుందరమైన సముద్ర తీరం.. అర్ధరాత్రి దాటినా కూడా తెరిచి ఉండే మద్యం షాపులు - బార్లు. వెరసి.. గోవా అంటే జల్సా రాయుళ్లకు స్వర్గధామం. పగలంతా ప్రకృతి అందాల మధ్య గడిపి రాత్రయితే చాలు బార్లలో వాలిపోతారు గోవాకు వెళ్లే పర్యాటకులు.

కానీ, ఇకపై అలాంటి అందమైన అనుభవాలు కష్టమేనట. గోవాలలో మందు బాబుల జ‌ల్సాల‌కు బ్రేక్ వేయడానికి అక్కడి మనోహర్ పారికర్ ప్రభుత్వం రెడీ అవుతోందట. రాత్రి 10 గంట‌లు దాటిన త‌ర్వాత బార్ల‌లో లేట్ నైట్ పార్టీలు - మ‌ద్యం సేవిస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఇప్పటికే ఆ రాష్ర్ట డీజీపీయే ప్రకటించారు. ఇదేమీ కొత్త నిర్ణ‌యం కాద‌ని పేర్కొంటూ ఇప్ప‌టికే స‌ద‌రు ఆదేశాలు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.

ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ త‌మ‌కు ప‌లు అంశాల్లో స్ప‌ష్ట‌మైన ఉత్త‌ర్వులు ఇచ్చార‌ని... వ్య‌భిచారం - లైంగిక వేధింపులు - మ‌ట్కా - గ్యాంబ్లింగ్‌ - డ్ర‌గ్ రాకెట్ వంటి అవాంచ‌నీయ ఘ‌ట‌న‌ల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సీఎం ఆదేశించడంతోనే చర్యలు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. మరోవైపు గోవా ప‌ర్యాట‌క శాఖా మంత్రి మ‌నోజ్ అగ్న‌నోక‌ర్ కూడా దీనిపై స్పందిస్తూ గోవా సంప్ర‌దాయంలో మద్యపానం అన్నది లేనేలేదని.. ప‌ర్యాట‌కులు వ‌చ్చి త‌మ రాష్ర్టాన్ని చెడ‌గొట్టేశార‌ని మండిప‌డ్డారు.

అయితే... ప్రభుత్వ నిర్ణయం తమ వ్యాపారాలను పూర్తిగా దెబ్బతీస్తుందని అక్కడ పర్యాటక రంగంపై ఆధారపడినవారంతా ఆందోళన చెందుతున్నారు. రాత్రి 10 గంట‌ల గ‌డువును మ‌రి కొద్ది సేపు పెంచాల‌ని కోరుతోంది. ప్రభుత్వం ఇలాగే కఠినంగా వ్యవహరిస్తే మాత్రం పర్యాటకులు డోన్ట్ గో గోవా అనడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/