Begin typing your search above and press return to search.

మటన్ తినేవారందరికీ ఇదీ షాకింగ్ న్యూస్

By:  Tupaki Desk   |   25 April 2020 6:30 AM GMT
మటన్ తినేవారందరికీ ఇదీ షాకింగ్ న్యూస్
X
కరోనా కాలంలో కాదేది కల్తీకి అనర్హంగా మారింది. జనాల అసహాయతను కొందరు మోసగాళ్లు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. వారానికి ఒకసారి తినే మటన్ లోనూ కల్తీ చేస్తూ దారుణ మోసానికి పాల్పడుతున్నారు.

ఈ కరోనా టైంలో జంతు మాసంలో మోసం చేస్తూ హైదరాబాద్ లో అడ్డంగా దొరికారు. గొర్రె, మేక మాంసంలో గొడ్డుమాంసం (బీఫ్)తోపాటు ఇతర జంతువుల మాసం కలిపి విక్రయిస్తున్న దారుణం హైదరాబాద్ లో వెలుగుచూసింది. షాక్ కలిగించే విషయం ఏంటంటే ఇదో పెద్ద మాఫియా. హైదరాబాద్ అంతా సప్లై చేస్తారట.. వీరిని అధికారులు పట్టుకొని దందా గుట్టురట్టు చేశారు.

హైదరాబాద్ లోని భాగ్యనగర్ వేదికగా జరుగుతున్న ఈ దందాను వెటర్నరీ అధికారులు రట్టు చేశారు. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో మటన్ అమ్ముతున్న దుకాణాల్లో నిర్వహించిన తనిఖీల్లో కళ్లు బైర్లు గమ్మే వాస్తవాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో మటన్ లో గొడ్డు మాంసం కలిపి అమ్ముతున్నట్టు తేలింది. వీరంతా మొత్తం హైదరాబాద్ కు సప్లై చేస్తున్నట్టు విచారణలో తెలిసింది.

కరోనా తో మటన్ కు డిమాండ్ పెరిగింది. ధర పెరిగింది. దీంతో కొందరు అక్రమార్కులు ఇలా మటన్ ను కల్తీ చేస్తున్నారు. కరోనా టైంలో పౌష్టికాహారం తినాలని సూచిస్తున్న నేపథ్యంతో దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. కరోనాతో మటన్ కు డిమాండ్, రంజాన్ మాసం కలిసిరావడంతోపాటు మటన్ రేటు 800-1100 పెరగడంతో ఇలా గోడ్డుమాంసంతో కల్తీ చేస్తున్నారు.

మటన్ లో బీఫ్ కలిపి హైదరాబాద్ వ్యాప్తంగా అమ్ముతున్నట్లు తెలియడంతో వినియోగదారులంతా షాక్ అయ్యారు. తాజా తనిఖీల్లో 62 దుఖాణాల్లో 50 దుకాణాలకు లైసెన్స్ లేదు. దీనిపై 3 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు అధికారులు. ఈ దారుణం వెలుగుచూశాక ప్రజారోగ్యమే గందరగోళంలో పడనుంది.