Begin typing your search above and press return to search.
గోట్ యోగా...అమెరికాలో ఇదే పాపులర్ అట!
By: Tupaki Desk | 21 Jun 2017 4:31 AM GMTయోగా... నరేంద్ర మోదీ భారత ప్రధాని అయిన తర్వాత విశ్వవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. భారత్‌లో పుట్టిన యోగా...మోదీ ప్రధాని కాక ముందు కూడా పలు దేశాల్లోకి ప్రవేశించినా... మోదీ ప్రధాని అయ్యాకే దాని విస్తరణలో మరింత వేగం పుంజుకుంది. నేడు ప్రపంచ యోగా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారత్ తో పాటు పలు దేశాల్లో పెద్ద పెద్ద కార్యక్రమాలు జరగనున్నాయి. భారతీయులైతే... మోదీ స్టైల్లో యోగాసనాలు వేసేందుకు ఇప్పటికే రెడీ అయిపోయారు. యోగాలో ఏముంటుంది... ఆరోగ్యానికి ఇతోదికంగా తోడ్పాటునందించే ఆసనాలు ఉంటాయి.
మన దేశం నుంచే యోగాను నేర్చుకున్న అగ్రరాజ్యం అమెరికా వాసులు ఇప్పుడు కొత్త యోగా రీతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. గోట్ యోగా పేరిట ఇప్పుడిప్పుడే అక్కడ ఎంటరైన ఈ యోగా అంటే అక్కడి వారు క్యూ కడుతున్నారట. అసలు ఈ గోట్ యోగా ఏంటి... ఎప్పుడు మనం వినలేదు కదా అనుకుంటున్నారా? మన యోగా రీతుల్లో ఈ తరహా యోగా ఉందో, లేదో తెలియదు గానీ... ఇప్పుడు అమెరికాలో మాత్రం అందరికీ ఫెవరేట్ యోగాగా మారిపోతోందట. రోజురోజుకూ దీని బాట పడుతున్న వారి సంఖ్య శరవేగంగా పెరుగుతోందని అక్కడి వార్తా ఛానెళ్లు ప్రత్యేక కథనాలను కూడా ప్రసారం చేస్తున్నాయి.
ఇక గోట్ యోగా అంటే ఏమిటో ఓ సారి పరిశీలిస్తే... అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో యోగా కేంద్రాల్లో ఆయా కేంద్రాల శిక్షకులు 15- 20 మేకలను సేకరిస్తున్నారు. యోగాసనాలు వేసే వారు కేంద్రంలోకి ఎంట్రీ ఇవ్వగానే... శిక్షకులు అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న మేకలను రంగంలోకి దించుతున్నారు. యోగాసనాలు వేసే జనం మధ్యలోకి ప్రవేశిస్తున్న ఈ మేకలు వారిపైకి ఎక్కేస్తున్నాయి. వీపుపై ఎక్కి అటూ ఇటూ తిరుగుతున్నాయి. అంటేకాకుండా కూర్చున్న వారి భుజాలపైకి ఎక్కి ఆటాడుకుంటున్నాయి. మేకలను మేని పైకి ఎక్కించుకునే జనం అవి వాటి కాళ్లతో చిన్నగా మర్దన చేస్తున్నట్లుగా అవి నడుస్తుంటే... అలా ఆస్వాదిస్తూ సేదదీరుతున్నారు. అయినా మేకలు మీదకెక్కితే... కాస్తంత బరువు ఎక్కువే ఉంటుందిగా. అందుకేనేమో మనందరికీ తెలిసిన పెద్ద మేకలను కాకుండా చిన్నగా, పొట్టిగా ఉండే నైజీరియా, పశ్చిమ ఆఫ్రికాకు చెందిన జాతుల మేకలను అమెరికా యోగా కేంద్రాల వారు సేకరిస్తున్నారట.
ఇక కాలి గిట్టలతో ఉండే మేకలు... మన మేనిపైకి ఎక్కి నడిస్తే గాట్లు పడవా అంటే... ఎందుకు పడవు. అప్పుడప్పుడు మేకల గిట్టల కారణంగా గోట్ యోగా చేసే వారికి చిన్న చిన్న గాయాలు కూడా అవుతున్నాయట. అయినప్పటికీ అమెరికన్లు గోట్ యోగాకే మొగ్గుచూపుతున్నారట. మేకలు మేనిపై నడుస్తుంటే... శరీరంలోని కొన్ని భాగాలకు ప్రేరణ జరుగుతుందట. ఇక మనం యోగాసనాలు వేస్తుంటే... మన ముందుకు వచ్చే మేకలు.. మన ముఖాన్నే కాకుండా వెంట్రుకలను కూడా స్పృశిస్తూ ఉంటాయట. మేకలు చేసే ఈ తతంగమంతటితో ఎంతో ప్రశాంతంగా ఉంటుందని గోట్ యోగాకు వెళ్లి వచ్చేవారు చెబుతున్నారట. వెరసి ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు గోట్ యోగాకు మంచి డిమాండ్ కూడా వచ్చేసిందట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/