Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాలకు షాకిచ్చిన గోదావరి బోర్డు
By: Tupaki Desk | 6 Jun 2020 3:45 AM GMTరెండు తెలుగు రాష్ట్రాలకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు షాకిచ్చింది. కొత్త ప్రాజెక్టులపై ముందుకెళ్లవద్దని ఆదేశించింది. కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వుల ప్రకారం.. గోదావరిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని ఉభయ తెలుగు రాష్ట్రాలకు బోర్డు స్పష్టం చేసింది. హైదరాబాద్ లో సమావేశమైన బోర్డు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
తెలంగాణలో కాళేశ్వరంతో పాటు అన్ని ప్రాజెక్టుల డీపీఆర్ లను ఇవ్వాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. డీపీఆర్ లను గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం పరిశీలించి అపెక్స్ కౌన్సిల్ నుంచి ప్రాజెుక్టులకు అనుమతి తీసుకోవాలని ఇరురాష్ట్రాలకు బోర్డు సూచించింది. ఈనెల 10వ తేదీలోగా డీపీఆర్ లు అందించాలని బోర్డు ఆదేశించింది. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014 జూన్ 2 తర్వాత చేపట్టినవి, సీడబ్ల్యూసీ నుంచి సాంకేతిక అనుమతి లేని ప్రాజెక్టులను కొత్తవిగానే పరిగణిస్తామని బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు.
తెలంగాణ సర్కార్ గోదావరిపై కాళేశ్వరం, తుపాకుల గూడం, సీతారామా, మిషన్ భీగీరథ, బీమ్ కుంద్, చనాఖా కోరాట ప్రాజెక్టులతో మొత్తం 450.31 టీఎంసీల గోదావరి జలాలను తరలించేలా ప్రాజెక్టులు చేపట్టిందని ఏపీ అధికారులు బోర్డుకు విన్నవించారు. దీనివల్ల గోదావరి డెల్టా, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని వాదించింది.
గోదావరి జలాల్లో తెలంగాణకు 967 టీఎంసీల నీరు వినియోగించుకునేలా తెలంగాణలో ప్రాజెక్టులు చేపడతామని ఉమ్మడి ఏపీలోనే నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారని.. దాని ఆధారంగానే గోదావరి నది నుంచి 967 టీఎంసీల నీటిని వాటాను వినియోగించుకుంటున్నామని తెలిపారు.
దీనిపై బోర్డు అభ్యంతరం తెలిపింది. వెంటనే కాళేశ్వరంతో సహా అన్ని కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ లను వెంటనే అందజేయాలని తెలంగాణ అధికారులను ఆదేశించింది. నీటి వినియోగంపై ప్రాజెక్టుల వద్ద టెలీమీటర్ల ఏర్పాటుపై రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.