Begin typing your search above and press return to search.

బోటు దొరికింది.. ఏం జ‌రిగిందంటే..

By:  Tupaki Desk   |   19 Oct 2019 10:14 AM GMT
బోటు దొరికింది.. ఏం జ‌రిగిందంటే..
X
తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు వద్ద మునిగిన రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులు మళ్లీ మొదలయ్యాయి. ధర్మాడి సత్యం టీమ్ గోదావరిలో బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. లంగర్ కు బోటు తగలడం.. పైకి లాగే ప్రయత్నంలో రైలింగ్ రావడంతో వెలికితీతకు కొంత ఊరట దక్కింది.

విశాఖకు చెందిన డైవర్లు ఈరోజు మునిగిన బోటుకు లంగరు తగిలించి బోటు తీస్తామని ముందుకొచ్చారు. ఇక కాకినాడ పోర్టు అధికారి బోటు మునిగిన ప్రాంతంలో లంగరు ఎలా వేయాలనే దానిపై సత్యం టీంకు సూచనలు చేశారు. లంగరు తగిలించి బోటును తాడుతో లాగుతున్న సమయంలోనే బోటు సుమారు 12 అడుగులు ముందుకు వచ్చిందని గుర్తించారు.

బోటును లంగరుతో లాగుతున్న సమయంలోనే డీజిల్ మరకలు నీటి పైకి రావడం సత్యం టీం గమనించింది. దీంతో బోటు అక్కడ ఉందని నిర్ధారణకు వచ్చారు. ఒడ్డు నుంచి 200 మీటర్ల దూరంలోపే ఆ బోటు ఉన్నట్టు గుర్తించారు. విశాఖ డైవర్లతో సాయంతో గోదావరి నీటిలో దిగి బోటుకు లంగర్ వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గజ ఈతగాళ్లు ఆక్సిజన్ సిలిండర్లతో గోదావరిలో దిగి బోటుకు లంగర్ వేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో బోటు వెలికితీతపై ఆశలు చిగురించాయి.