Begin typing your search above and press return to search.
పశ్చిమ తీరానికి గోదావరి ఆత్మీయ పలకరింపు - సిలికాన్ వ్యాలీలో గోదావరి రెస్టారెంట్
By: Tupaki Desk | 27 May 2016 4:00 PM GMTకాలిఫోర్నియా - యూఎస్ ఏ - మే 27 - 2016: భారతీయ వంటకాలను ఆత్మీయంగా అందించడంలో సుప్రసిద్ధ పేరుగాంచిన ‘గోదావరి’ ఇపుడు పశ్చిమ తీరంలోని సిలికాన్ వ్యాలీలో నూతన రెస్టారెంట్ తో వినియోగదారులకు మరింత చేరువ అయింది.
అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న ఇండియన్ రెస్టారెంట్ చైన్ ఇపుడు టెక్నాలజీ అడ్డగా నిలిచిన సిలికాన్ వ్యాలీలో మే 28వ తేదీన కొత్త రెస్టారెంట్ ప్రారంభంతో పశ్చిమప్రాంతంలో విజయవంతంగా అడుగిడనుంది.
చెవులూరించే భారతీయ వంటకాలను మన దేశ ఎన్నారైలకు అందిస్తున్న గోదావరి అమెరికాలోని ప్రముఖ నగరాలన్నింటిలోనూ కొలువుదీరింది. తన వార్షికోత్సవం జరుపుకొనేందుకు ఉత్సాహంతో సిద్ధమవుతున్న గోదావరి బే ఏరియాలో అథెంటిక్ సౌత్ ఇండియన్ వంటకాలను - రెసీపీలను వడ్డించేందుకు సన్నద్ధం అయింది.
ఆపిల్ వంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థలు కొలువుదీరిన కీలక ప్రాంతంలో 150 సీట్ల సామర్థ్యంతో గోదావరి తన రెస్టారెంట్ ను ఏర్పాటుచేసింది. భారతీయులకు చేరువ అయ్యే చక్కటి స్థలంలో ఏర్పాటుచేసిన ఈ రెస్టారెంట్ లో రెండు బాంక్వెట్ హాల్లు ఉన్నాయి. గోదావరి రెస్టారెంట్ ను ప్రారంభించే రోజు అత్యుత్తమంగా నిలిచే గోదావరి గ్రాండ్ బఫెట్ తో పాటు అన్ లిమిటెడ్ బీర్ సౌలభ్యాన్ని ఏర్పాటుచేశారు.
గోదావరి సంప్రదాయంలో భాగమైన కొంగొత్త వంటకాలు - రెసీపీలు సిలికాన్ వ్యాలీ రెస్టారెంట్ లో కూడా చోటును సంపాదించుకున్నాయి. ‘మైసూర్ మొక్కజొన్న గారెలు’ - ‘అజారుద్దీన్ ఆలుగడ్డ వేపుడు’ - ‘మంగమ్మగారి ములక్కాయ పకోడి’ వంటి నోరూరించే శాఖాహార వెరైటీలు అలరించనున్నాయి. వీటితో పాటు మాంసాహార వంటకాల్లో ‘పాలమూరు పిట్ట వేపుడు’ - ‘జయలలిత కుట్టు పరోటా’ - ‘కన్యాకుమారి కొత్తిమీర కోడి’ వంటి చెవులూరించే వంటలు సిద్ధంగా ఉన్నాయి. ఇంతేకాకుండా కాలిఫోర్నియా బాదం హల్వాతో పాటు మరెన్నో వంటకాలు గోదావరి ప్రత్యేకతను చాటనున్నాయి.
ఈ సందర్భంగా గోదావరి గ్రూప్ వ్యవహారాల బాధ్యుడు జశ్వంత్ రెడ్డి ముక్కా మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘దక్షిణ భారతదేశ వంటకాలను అమెరికాలోని భారతీయ సమాజానికి చేరువ చేసేందుకు గోదావరి రూపంలో అవకాశం దొరకడం మా అదృష్టం. అమెరికాలోని కీలకప్రాంతాలన్నింటికీ గోదావరిని విస్తరించేందుకు మేం ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం’ అని తెలిపారు.
గోదావరి గ్రూప్ సహ వ్యవస్థాపకుడు తేజా చేకూరి మాట్లాడుతూ...’పశ్చిమ తీర వాసులకు చెవులూరించే వంటకాలు అందించేందుకు గోదావరి ద్వారా కొత్త రెస్టారెంట్ ను ప్రారంభిస్తున్నాం. మా మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వినూత్నంగా “బంతి భోజనం” సంప్రదాయంతో గోదావరి విస్తరించి ఉన్న అన్నిచోట్లా సంబరాలు చేసుకోనున్నాం’ అని ప్రకటించారు.
గోదావరి గ్రూప్ నకు చెందిన కౌశిక్ కోగంటి మాట్లాడుతూ సామాజిక బాధ్యతను మరిచిపోకుండా ఉండేందుకు గోదావరి గ్రూప్ రెస్టారెంట్ యాజమాన్యం కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు అండగా ఉండి సహాయం చేసేందుకు - వారి పిల్లల చదువుకు - భవిష్యత్తుకు అండగా నిలబడేందుకు ‘గోదావరి ఫౌండేషన్’ పేరుతో తోడ్పాడు అందించేందుకు సన్నద్దమైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఫౌండేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే ఫాండేషన్ ను ప్రారంభిస్తామని ప్రకటించారు.
భారతీయుల్లోని “వెగాన్ ఫుడ్” ప్రియులకు అత్మీయ ఆతిథ్యం అందించేందుకు గోదావరి గ్రూప్ కొత్త అడుగులు వేస్తోంది ‘గోదావరి భవన్’ పేరుతో కొత్త రెస్టారెంట్ను అందుబాటులోకి తేనుంది. ఈ రెస్టారెంట్ లో పూర్తి శాఖాహార వంటకాలను వివిధ వెరైటీల్లో అందించనుంది.
దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతున్న గోదావరి గ్రూప్ సంస్థ ఇతర ప్రాంతాల్లోకి సైతం విస్తరించేందుకు క్రియాశీలంగా అడుగులు వేస్తోంది. ఆస్టిన్ - పిట్స్ బర్గ్ - లాస్ ఎంజెలిస్ - మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా)లో రాబోయే మాసాల్లో గోదావరి రెస్టారెంట్ లను ఏర్పాటు చేయనుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే శాఖాహారా రెస్టారెంట్లకు ఇవి అదనం.
గోదావరి డల్లాస్‌కు ఆత్మీయ అతిథుల రాకతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. గోదావరి డల్లాస్ ను ప్రారంభించిన అనంతరం వచ్చిన విశేష స్పందన నేపథ్యంలో 1000 మందికి అతిథులకు ఆతిథ్యం అందించే ఏర్పాట్లు సిద్ధం చేశారు.
గోదావరి డల్లాస్ ప్రారంభోత్సవ వీడియోను ఈ వీడియోలో చూడవచ్చు: https://youtu.be/zri7UjZpU_o
మా వారసత్వం కాలిఫోర్నియా రాష్ట్రంలో కొనసాగుతుందని, భోజన ప్రియులంతా గోదావరి అందిస్తున్న విశేష ఆతిథ్యాన్ని స్వీకకరిస్తారని నమ్మకంతో ఉన్నాం.
సంప్రదించవలసిన చిరునామాః
గోదావరి సన్నీవేల్
727 ఎస్ ఊల్ప్ రోడ్,
సన్నీవేల్ - కాలిఫోర్నియా 94086.
ఫోన్: 408-542-9095
మరోమారు ఆత్మీయ ధన్యవాదాలు. మా సేవలను మీరు ఆస్వాదిస్తారని భావిస్తున్నాం.
మీ ఆత్మీయ రాకకోసం ఎదురుచూస్తూ...
రాజా జాకికటి
SUNNYVALECA@GODAVARIUS.COM
ఫోన్ః 408 507 3507
www.Godavarius.com
Press note released by: Indian Clicks, LLC