Begin typing your search above and press return to search.
ఫిబ్రవరి 27న మేరీల్యాండ్ మెట్రో, వాషింగ్టన్ డీసీలో ఉరకలెత్తనున్న ‘గోదావరి'
By: Tupaki Desk | 26 Feb 2016 1:30 PM GMTమేరీల్యాండ్ మెట్రో, ఫిబ్రవరి 27, 2016: దక్షిణ భారత వంటకాలను అందిస్తూ.. యునైటెడ్ స్టేట్స్ లో శరవేగంగా విస్తరిస్తున్న రెస్టారెంట్ ల శ్రేణి ‘గోదావరి’ 27 ఫిబ్రవరి 2016 న మెట్రో వాషింగ్టన్ డీసీ లోని మేరీల్యాండ్ లో గైదర్స్ బర్గ్ లో తమ రెస్టారెంట్ ను ప్రారంభించనుంది.
ఫిబ్రవరి 20న న్యూజెర్సీలోని ఎడిసన్ లో వీరు ప్రారంభించిన రెస్టారెంట్ కు అక్కడ అనూహ్యమైన స్పందన లభిస్తోంది.
మేరీల్యాండ్ మరియు మెట్రో వాషింగ్టన్ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా చిరస్మరణీయంగా మిగిలిపోయే భోజన అనుభూతులను... సాధికారిక స్వదేశీ వంటకపు రుచుల ద్వారా అందించడంలో తనదైన శైలిని ‘గోదావరి’ కొనసాగించనుంది.
వాషింగ్టన్ డీసీలోని బాల్టిమోర్ - రాక్ విలే మరియు దక్షిణభారత వాసులు అత్యధికంగా నివసించే ఇతర అనేక ప్రాంతాలకు చాలా సమీపంలోనే ఈ 120 సీట్ల సదుపాయం ఉన్న రెస్టారెంట్ ను ఏర్పాటుచేశారు.
ప్రారంభోత్సవం రోజున చాలా ఘనంగా ఏర్పాటుచేస్తున్న గ్రాండ్ బఫే లో 'శర్మ దాభా ఆలూ ఫ్రై' - 'ఆవకాయ చికెన్ వింగ్స్' - 'బెజవాడ బాతు పులుసు' - 'నిజామాబాద్ నిమ్మకాయ కుందేలు' - 'చిట్టెమ్మ గారి చేతి గారెలు' - 'రత్తమ్మ గారి రొయ్యల పులుసు' - 'పెదరాయుడు పీతల ఇగురు' - 'శ్రీదేవి షాహి టక్ డా' ఇంకా అనేక వంటకాలు భోజనప్రియుల చెవులూరించనున్నాయి. మేరీల్యాండ్ మరియు మెట్రో వాషింగ్టన్ డీసీ ప్రాంతంలోనే అతిపెద్ద లంచ్ బఫే గా.. గోదావరి బఫే నిలవనుంది.
ఈ రెస్టారెంట్ ప్రారంభించడంపై మేరీల్యాండ్ గోదావరి ఫ్రాంచైజ్ ఓనర్ కామాక్షి తుమ్మలపల్లి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ''గోదావరి బృందంలో ఓ సభ్యురాలిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సొంత రెస్టారెంట్ తెరవాలనే కొన్నేళ్ల నాటి నా కలను సాకారం చేసినందుకు గోదావరికి చెందిన కౌశిక్ కోగంటి - తేజా చేకూరి లకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇక్కడి భారతీయులకు పసందైన స్వదేశీ రుచులు అందించాలనే కల సాకారం అవుతోంది’’ అని ఆమె అన్నారు.
గోదావరి రెస్టారెంటుల శ్రేణిలో భాగం కాగలిగినందుకు మేరీల్యాండ్ ప్రాంతపు గోదావరి ఫ్రాంచైజ్ కో-ఓనర్ ప్రదీప్ రావెళ్ల కూడా సంతోషం వెలిబుచ్చారు. ''ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద రెస్టారెంట్ ను ఏర్పాటుచేయడానికి గోదావరి వారి బృందం మాకు చేసిన సహాయానికి నేను ముగ్ధుడైపోయాను. ఇక్కడి భారతీయులకు తమ ఇంట్లో ఉన్నటువంటి అనుభూతి కలిగేలా స్వదేశీ రుచులను అందించడంలో భాగం అవుతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది.'' అని మేరీల్యాండ్ ప్రాంతంలో సినీ పంపిణీ రంగంలో కూడా ఉన్న ప్రదీప్ చెప్పారు.
గోదావరి ఫ్రాంచైజీలు త్వరలోనే డిలావేర్ - డలాస్ లలో కూడా ప్రారంభం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ లోని ఇంకా అనేక ప్రాంతాలకు కూడా దక్షిణ భారత దేశపు రుచులను భోజన ప్రియులకు అందించడానికి ఇంకా ఎంతో మంది ఔత్సాహికులు కలిసి పనిచేయబోతున్నారు.
తమ రెస్టారెంట్ లకు వేల్యూ యాడెడ్ ప్రయత్నాల్లో భాగంగా గోదావరి వారు.. ఒక మొబైల్ అప్లికేషన్ ను కూడా రూపొందిస్తున్నారు. దీని ద్వారా వినియోగదారులు తమ భోజన సమయాన్ని ప్లాన్ చేసుకోవడానికి రెస్టారెంట్ కు కాల్ చేయాల్సిన అవసరం లేకుండా, యాప్ ద్వారా చేసుకోవడం వీలవుతుంది.
అమెరికా వ్యాప్తంగా ఉన్న భారతీయులందరినీ స్వదేశ రుచులతో సమ్మోహితుల్ని చేసిన తర్వాత.. కెనడా - సింగపూర్ - ఆస్ట్రేలియా - యూకే లకు కూడా విస్తరించాలని టీమ్ గోదావరి వారు ప్లాన్ చేస్తున్నారు.
ప్రత్యేకించి ఎడిసన్ లో ఘనంగా జరిగిన గోదావరి ప్రారంభోత్సవం నాడు ఆ ప్రాంతంలో కిటకిటలాడిపోయిన జనం రద్దీని నియంత్రించడంలో ఎంతో సహకరించిన ఎడిసన్ లోని పోలీసు మరియు ఫైర్ శాఖల వారికి గోదావరి న్యూజెర్సీ టీం వారు ఒక ప్రకటనలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
గోదావరి ఎడిసన్ - న్యూజెర్సీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వీడియో: https://youtu.be/aoJMHuhdtaE
ఫిబ్రవరి 27న ప్రత్యేకమైన గ్రాండ్ లంచ్ బఫేతో ప్రారంభించి.. మేరీల్యాండ్ వినియోగదారులకు గోదావరి రుచులను అందించడాన్ని కొనసాగించగలమని విశ్వసిస్తున్నాం.
సదా మీ సేవకై నిరీక్షిస్తూ..
గోదావరి మేరీల్యాండ్
9011 గైదర్ రోడ్,
గేదర్స్ బర్గ్, ఎండి 20877.
ఫోను: 301-977-8600
మా సేవలతో మీరు సదా ఆనందించగలరని ఆశిస్తూ మరోసారి కృతజ్ఞతలు.
దయచేసి సంప్రదించండిః
ప్రదీప్ రావెళ్ల
MD@GODAVARIUS.COM
443-784-9999
www.Godavarius.com
Press note released by: IndianClicks, LLC