Begin typing your search above and press return to search.

ఏ ఎపీ ఎంపీ మొద‌ట ప్ర‌మాణ‌స్వీకారం చేస్తారు?

By:  Tupaki Desk   |   17 Jun 2019 3:30 AM GMT
ఏ ఎపీ ఎంపీ మొద‌ట ప్ర‌మాణ‌స్వీకారం చేస్తారు?
X
మ‌రికొద్ది గంట‌ల్లో (సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు) 17వ లోక్ స‌భ కొలువు తీర‌నుంది. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన త‌ర్వాత తొలిసారి లోక్ స‌భ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. సీనియ‌ర్ నేత‌గా ఉన్నబీజేపీ ఎంపీ వీరేంద్ర‌కుమార్ ప్రోటెం స్పీక‌ర్ గా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. తొలుత ఆయ‌న్ను ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో రాష్ట్రప‌తి కోవింద్ ఆయ‌న చేత ప్ర‌మాణం చేయించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌ధాని మోడీతో స‌హా ప‌లువురు కేబినెట్ మంత్రులు హాజ‌రు కానున్నారు.

ఈ కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత ఈ రోజు ఉదయం 11 గంట‌ల‌కు లోక్ స‌భ ప్రారంభం కానుంది. తొలుత ప్ర‌ధాని మోడీ.. త‌ర్వాత కేబినెట్ మంత్రులు.. ప్యాన‌ల్ ఛైర్మ‌న్లు ఎంపీలుగా ప్ర‌మాణం చేస్తారు. ఎంపీల ప్ర‌మాణం అక్ష‌ర‌మాల‌కు అనుగుణంగా సాగ‌నుంది.

ఆంగ్ల అక్ష‌రాల ప్ర‌కారం ఎంపీల చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయిస్తారు. ఇందులో భాగంగా తొలుత అండ‌మాన్ నికోబార్ ఎంపీ ప్ర‌మాణం చేస్తారు. అనంత‌రం ఏపీకి చెందిన ఎంపీలు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. అర‌కు ఎంపీ గొడ్డేటి మాధ‌వి తొలుత ప్ర‌మాణ‌స్వీకారం చేస్తారు. ఈ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మాలు దాదాపు రెండు రోజుల పాటు సాగ‌నున్నాయి.