Begin typing your search above and press return to search.

దేవుడికే నష్టపరిహారాన్ని ఇచ్చారు!

By:  Tupaki Desk   |   14 April 2015 5:53 AM GMT
దేవుడికే నష్టపరిహారాన్ని ఇచ్చారు!
X
రాజస్థాన్‌ ప్రభుత్వం ఒక ఆసక్తికరమైన పనిని చేసింది. ప్రకృతి విపత్తులు వచ్చి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో కొంత విడ్డూరమైన పనిని చేసింది. ఏకంగా దేవుడి పేరుతో చెక్కులు ఇచ్చి ఆశ్చర్యకరంగా వ్యవహరించింది! మరి దేవుడి పేరుతోచెక్కులేమిటి? ఎందుకు? అంటే... బుండీ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే.

గత సీజన్‌లో వరదల కారణంగా పంటనష్టంజరిగింది. వేల ఎకరాల్లోని పంటలు నాశనం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. పంటల బీమా తదితరాలను పరిగణనలోకి తీసుకొని ఎకరానికి ఇంత అనే లెక్కలో చెక్కులను జారీ చేసింది.

మరి మనదేశంలో ఏ మూలకు వెళ్లినా దేవుడి మాన్యాలు ఉంటాయి కదా.. అదే విధంగాఈ పంట నష్టపోయిన ప్రాంతంలో కూడా దేవుడి భూములున్నాయి. ఆలయాల పోషణలకు ఆ భూములపై వచ్చే పంటలే ఆధారం. ఇలాంటి నేపథ్యంలో ఆ భూమల్లోని పంట కూడా పాడైపోయింది.

దీంతో పంట నష్టపరిహారం చెల్లించక తప్పడం లేదు. రైతుల భూములకు అయితే వారి వారి పేర్ల మీద చెక్కులు జారీ చేయవచ్చు. ఈ దేవుడి మాన్యాల విషయంలో ఎలా వ్యవహరించాలి? అనే ధర్మ సందేహం వచ్చింది అధికారులకు. ఈ విషయాన్ని ఆలయ ధర్మకర్తల, పూజరాలు వద్ద ప్రస్తావించగా.. వారు దేవుడి పేరుమీదే చెక్కులు ఇవ్వాలని కోరారు.

దీంతో అధికారు ఆ ఆలయంలోని స్వామి వారి పేరు మీద చెక్కులు జారీ చేసి పంట నష్టపరిహారాన్ని చెల్లించారు! మరి ఇప్పుడు ఆ చెక్కుల మార్పిడి ఎలా? వాటిపై సంతకాలు చేసి.. డబ్బుల డ్రా చేసి డబ్బును ఆలయ పోషణకు అందజేయడానికి దేవుడే దిగిరావాలా?!