Begin typing your search above and press return to search.

పోయే కాలం కాకుంటే ఇదేంటి? గాంధీ జయంతి రోజున గాడ్సే ట్రెండింగ్?

By:  Tupaki Desk   |   3 Oct 2021 3:51 AM GMT
పోయే కాలం కాకుంటే ఇదేంటి? గాంధీ జయంతి రోజున గాడ్సే ట్రెండింగ్?
X
ప్రజాస్వామ్యం ఇచ్చే స్వేచ్ఛను ఎలా వినియోగించుకోవాలన్న అంశం మీదా మనకు సరైన అవగాహన లేదా? జాతిపిత గాంధీ మీద కొందరికి కొన్ని భిన్న భావనలు ఉండొచ్చు. కానీ.. ప్రపంచం మొత్తం మహనీయుడిగా కీర్తించే గాంధీ మహాత్ముడ్ని కించపరుస్తూ.. ఆయన్ను చంపేసిన గాడ్సే అనే అతివాదిని కొలవటం దేనికి నిదర్శనం. గాంధీని వ్యతిరేకించే కొందరు గాడ్సేను పొగిడేస్తుంటారు. నిజానికి ఇది తీవ్రమైన అంశంగా చెప్పాలి. వ్యక్తి ఎలాంటివాడైనప్పటికీ.. చంపేయటం సమస్యలకు పరిష్కారం కాదు కదా?

ఇప్పుడున్న సమాజంలో విభిన్నమైన ఆలోచనలు.. అతివాద అంశాలు ఆదరణకు నోచుకుంటున్నాయి. అదే సమయంలో.. విలువల్ని పెద్దగా పట్టించుకోని తత్త్వం అంతకంతకూ పెరుగుతోంది. ఇందుకు.. కేంద్రంలోని మోడీ సర్కారుతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ తరహా రాజకీయాలకుతెర తీస్తున్నాయి. పోయే కాలం కాకుంటే ఏంటి? జాతిపిత పుట్టిన రోజున ఆయన ప్రాణాలు తీసి గాడ్సే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలవటం దేనికి నిదర్శనమని చెప్పాలి? గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సే హీరోగా.. ఆయన్ను జిందాబాద్ అంటూ సోషల్ మీడియాలో కొలవటాన్ని ఏమనాలి? ఎటు పోతున్నట్లు? అన్న సందేహం కలుగక మానదు.

ఉగ్రవాదులకు అనుకూలంగా ట్వీట్లు పెడితే వెంటనే తీసేసే ట్విటర్ కు గాడ్సే ఎవరన్న విషయం తెలీదనుకోవాలా? ఆయనకు అనుకూలంగా పెట్టిన ట్వీట్లను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నట్లు? ఆయనకు జై కొడుతూ.. గాంధీని తిట్టిపోస్తున్న వైనాన్ని ఎలా తీసుకోవాలి? మరోవైపు గాడ్సేను పొగిడేస్తున్న వైనంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉండటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. గాడ్సేపై సాగుతున్న పబ్లిసిటీపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మాత్రం తప్పు పట్టారు. దేశాన్ని గొప్ప స్థానంలో నిలిపిన గాంధీని ఆయన జయంతి రోజున గాడ్సేను పొగుడుతున్న వారి మీద చర్యలు తర్వాత.. కేంద్రం తప్ప పట్టకపోవటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. గాడ్సే జిందాబాద్ ట్విటర్ లో ట్రెండింగ్ గా మారటం గమనార్హం. ఇదిలా ఉంటే.. గాడ్సే మీద బయోపిక్ తీస్తానని బాలీవుడ్ ప్రముఖులు మహేశ్ ముంజ్రేకర్ టీం తాముగాడ్సే సినిమాను తీస్తున్నట్లు ప్రకటించి మరో రచ్చకు తెర తీశారు.