Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ జర్నీతో వరల్డ్ రికార్డు నెలకొల్పిన 'గాడ్విట్'..!

By:  Tupaki Desk   |   6 Jan 2023 9:30 AM GMT
అన్ స్టాపబుల్ జర్నీతో వరల్డ్ రికార్డు నెలకొల్పిన గాడ్విట్..!
X
నెమలి తరహాలో ఉండే గాడ్విట్ పక్షి తన అన్ స్టాపబుల్ జర్నీతో ప్రపంచ రికార్డు నెలకొల్పి గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకుంది. గతంలో ఇదే గాడ్విట్ సంతతికి చెందిన పక్షి ఏకదాటిగా 217 మైళ్ల దూరం ప్రయాణించి రికార్డు నెలకొల్పింది. ఈ జర్నీ కారణంగా ఆ పక్షి బరువు సగానికి పైగా తగ్గిపోయిందని టస్మానియాకు చెందిన వ్యన్యప్రాణి నిపుణులు ఎరికో వోఎహ్లెర్ చెప్పారు.

ఆ రికార్డును అదే సంతతికి చెందిన గాడ్విట్(లిమోసా లప్పినోకా) పక్షి అధికారికంగా బద్దలు కొట్టింది. 234684 నెంబర్ ట్యాగ్ తో గాడ్విట్ పక్షి కింది భాగంలో 5జీ శాటిలైట్ ను ఎరికో వోఎహ్లెర్ అమర్చారు. దీని ద్వారా గాడ్విట్ పక్షి ప్రయాణాన్ని గమనించారు. అక్టోబర్ 13వ తేదిన గాడ్విట్ పక్షి అమెరికా రాష్ట్రమైన అలస్కా నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఆస్ట్రేలియాలోని టాస్మానియా రాష్ట్రానికి వలస వెళ్లింది.

దాదాపు 11 రోజుల పాటు ఎక్కడా ఈ పక్షి భూమిపై వలకుండా ముందుకెళ్లింది. కనీసం ఆహారం.. నీటిని కూడా తీసుకోకుండా అన్ స్టాపబుల్ గా జర్నీని కొనసాగించి అనుకున్న గమ్యాన్ని చేరుకుంది. రాత్రి పగలు తేడా లేకుండా గాడ్విట్ పక్షి 11 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని ఆకలి దప్పికలను తీర్చుకోకుండా పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పి తద్వారా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంది.

ఈ గాడ్విట్ పక్షి ప్రయాణించిన దూరం భూమి చుట్టుకొలతలో సుమారు మూడో వంతుతో సమానం. ఊదాహరణకు లండన్ నుంచి న్యూయార్క్ మధ్య రెండుసార్లు ప్రయాణిస్తే ఎంత దూరమో అంత దూరాన్ని గాడ్విట్ పక్షి విరామం తీసుకోకుండా ప్రయాణించిందని వన్యప్రాణి నిపుణుడు ఎరిక్ వోఎహ్లెర్ వెల్లడించారు.

గాడ్విట్ పక్షి జీవితం ఎంతో రిస్క్ తో కూడకున్నదని ఎరిక్ తెలిపారు. చిన్న తోక.. పొడుగు ముక్కు.. సన్న కాళ్లతో ఉండే ఈ పక్షి 90 డిగ్రీల యూటర్న్ తీసుకొని నేల మీద వాలే ప్రత్యేక స్వభావాన్ని కలిగి ఉంటుందన్నారు. లోతైన నీటిలో కనుక ఈ పక్షి వాలితే ప్రాణాలు కోల్పోతాయని చెప్పారు. వీటి కాళ్ల కింది భాగం నీటిలో తేలేందుకు అనువుగా ఉండకపోవడమే ఇందుకు కారణమని వివరించారు.

అందువల్ల ఈ గాడ్విట్ పక్షులు నీటిలో పడితే మళ్లీ పైకి ఎగుర లేవని చెప్పారు. 234684 నెంబరు కలిగిన గాడ్విట్ పక్షి సుమారు 11 వేల కిలోమీటర్ల దూరాన్ని విరామం లేకుండా సముద్రాలు దాటుకుంటూ ప్రయాణించడం ఎంతో రిస్క్ తో కూడుకున్నదని ఎరిక్ వివరించారు. అధికారికంగా అత్యధిక దూరం ప్రయాణించిన పక్షిగా 234684 నెంబరు కలిగిన గాట్విట్ తాజాగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుందని ఎరిక్ సంతోషం వ్యక్తం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.