Begin typing your search above and press return to search.

మృతి చెందిన టెక్కీ కోసం 7000 మంది కదిలారు

By:  Tupaki Desk   |   24 Feb 2017 4:51 PM GMT
మృతి చెందిన టెక్కీ కోసం 7000 మంది కదిలారు
X
అమెరికాలోని తెలుగువారు సహా ఆ దేశవాసులు సైతం తమ గొప్ప మనసును చాటుకున్నారు. జాత్యాహంకారంతో ఆడమ్ పూరింటన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో కాన్సస్ లో నివసిస్తున్న శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సాయమందించేందుకు అనేక మంది పెద్ద మనసుతో స్పందించారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించి ఊరుకోకుండా 2,60,000 డాలర్ల(రూ. కోటి66లక్షలు) ఆర్థిక సాయాన్ని విరాళంగా సిద్ధం చేశారు. త్వరలో ఈ మొత్తాన్ని అతని కుటుంబానికి అందించనున్నారు.

జాత్యాంహకారంతో జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల దుర్మరణం పాలవడం పట్ల పలువురు తీవ్రంగా కలత చెందారు. గో ఫండ్ మి పేరుతో ఓ పేజీని క్రియేట్ చేసి దాని ద్వారా వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. లక్షా 50వేల డాలర్లు సేకరించాలని ఈ పేజీని క్రియేట్ చేసినప్పటికీ అంచనాలను మించిన స్పందన వచ్చింది. మొత్తం7వేలకుపైగా మంది ప్రజలు విరాళాలను అందించడంతో విరాళం 2,50,000డాలర్లను దాటింది. కాగా మొత్తం విరాళాలను శ్రీనివాస్ కుటుంబానికి అందించనున్నట్లు వివరించారు. మరోవైపు ఇదే ఘటనలో గాయపడిన వరంగల్‌ వాసి అలోక్ మాదాసికి తీవ్రగాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కాగా, హైద‌రాబాద్‌లో కుచిబొట్ల సోద‌రుడు మీడియాతో మాట్లాడారు. వ‌ల‌స‌దారుల‌పై క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్న దేశాధ్య‌క్షుడు ట్రంప్ వ‌ల్లే ఇదంతా జ‌రిగిన‌ట్లు శ్రీ‌నివాస్ సోద‌రుడు ఆరోపించారు. ఈ దుర్ఘటన విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌, స్థానిక బీజేపీ బృందాలు, తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ‌కు స‌హ‌క‌రిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. వీలైనంత త‌ర్వ‌గా శ్రీ‌నివాస్ మృత‌దేహాన్ని తీసుకురావాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరిన‌ట్లు ఆయ‌న చెప్పారు. త‌మ దేశం విడిచి వెళ్లాల‌ని అరుస్తూ ఓ శ్వేత‌జాతీయుడు త‌న సోద‌రుడిపై కాల్పులు జ‌రిపిన‌ట్లు ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/