Begin typing your search above and press return to search.
పండగ వేళ పసిడి బాండ్లు వచ్చేశాయ్
By: Tupaki Desk | 6 Oct 2019 7:23 AM GMTప్రస్తుతం బంగారం ధర నిన్నమొన్నటి వరకు జట్టు రాకెట్ స్పీడ్‌తో ఉరుకులు పరుగులు పెట్టేసింది. లైఫ్ టైం హిస్టరీ లోనే 10 గ్రాముల బంగారం ధర రు. 40 వేలు టచ్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడిప్పుడే బంగారం రేటు కాస్త తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే దసరా పండుగ సందర్భంగా బంగారం కొనుగోలుకు మరో అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం ప్రభుత్వం మరోసారి బంగారు బాండ్లను జారీ చేయనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ఇప్పటికే నాలుగు విడతల్లో బాండ్లు జారీ చేయగా... ఇప్పుడు ఐదో సారి బాండ్లను జారీ చేస్తున్నారు. ఈ బాండ్ల జారీ సోమవారం ఈ నెల 7న ప్రారంభమై శుక్రవారం 11తో ముగుస్తోంది. ఈ సారి ఇష్యూ ధరను గ్రాముకు రూ.3,788గా నిర్ణయించారు. తాజా బాండ్ల జారీలో ప్రభుత్వం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది.
బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంతో పాటు డిజిటల్ మార్గంలో చెల్లింపులు చేపట్టే వారికి ప్రభుత్వం గ్రాముకు రూ.50 రాయితీ కల్పిస్తోంది. ఇక ఈ బంగారం బాండ్లను ప్రోత్సహించడం వెనక అనేక కారణాలు కూడా ఉన్నాయి. పెట్టుబడి అవసరాలకు లోహం రూపంలో బంగారం కొనుగోళ్లను తగ్గించేందుకు 2015 నవంబరులో ప్రభుత్వం పసిడి బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ ప్రక్రియలో బాండ్లను యూనిట్ల రూపంలో జారీ చేస్తారు. ఒక గ్రాము బంగారాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. ఒక యేడాదిలో ఒక వ్యక్తి గరిష్టంగా 500 గ్రాములు (యూనిట్లు) మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్)లకు ఈ పరిమితిని 4 కిలోలుగా, ట్రస్టులకైతే 20 కేజీలుగా నిర్ణయించారు.