Begin typing your search above and press return to search.
శ్రీకాకుళం ఒడ్డుకు కొట్టుకొచ్చిన బంగారు రథం.. ఎక్కడిదై ఉంటుంది?
By: Tupaki Desk | 11 May 2022 9:15 AM GMTఏపీ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని భావిస్తున్న ‘అసాని’ తుపానుతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం తెలిసిందే. తుపాను లాంటి వేళ ఈదురుగాలులు.. భారీ వర్షాలతో పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉండటమే కాదు.. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతుంటాయి.
సముద్ర తీర ప్రాంతంలో ఉండే ప్రజలకు ఇలాంటి అనుభవాలెన్నో. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో సముద్ర తీర ప్రాంతం లేకపోవటంతో తుఫాను కారణంగా భారీ వర్షాలే తప్పించి.. తుపాను వేళ తీర ప్రాంతం వేళ ఎంత దారుణ పరిస్థితి ఉంటుందో చాలామందికి తెలీదు.
తుపాన్ల వేళ సముద్రం అల్లకల్లోలంగా ఉండటమే చూసిన తీర ప్రాంత ప్రజలకు తాజాగా విరుచుకుపడుతుందని భావిస్తున్న అసాని తుపాను వేళ.. ఒక అద్భుతమే జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి సున్నాపల్లి రేవునకు ఒక బంగారు వర్ణంతో ఉన్న ఒక అందమైన రథం కొట్టుకు వచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఒక ఫ్లాట్ ఫాం మీద తయారు చేసిన ఈ బంగారు రథం సముద్రంలో కొట్టుకు రావటం.. దానికి ఎలాంటి డ్యామేజీ లేకపోవటం విశేషం. వందల నాటికల్ మైళ్ల నుంచి కొట్టుకు వచ్చిన ఈ బంగారు రథం.. చూసినంతనే ఆకర్షించేలా ఉంది.
ఈ రథం మీద 16-01-2022 తేదీతో పాటు.. విదేశీ భాషలో రాసి ఉండటంతో.. అదేమీటన్నది అర్థం కాని పరిస్థితి. ఈ రథం గురించి సమాచారం అందుకు అధికారులు.. ఈ రథాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొందరి వాదన ప్రకారం ఈ రథం జపాన్.. థాయ్ లాండ్.. మలేషియా దేశాలకు చెందినది అయి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కొన్నిదశాబ్దాలుగా ఏపీ తీరం ఎన్నో తుపాన్లను చూసినప్పటికి ఎప్పుడూ కూడా ఈ తరహాలో రథం కొట్టుకురాలేదన్న మాట వినిపిస్తోంది. ఈ రథం ఏమిటి? నిజంగానే బంగారు రథమా? లేక.. ఏదైనా సెట్టింగా? అన్నది తేలాల్సి ఉంది. స్థానికంగా సంచలనంగా మారటమే కాదు.. ఈ బంగారు వర్ణ రథాన్ని చూడటానికి మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.