Begin typing your search above and press return to search.

బురదలో బంగారం.. తీసుకున్నోళ్లకు తీసుకున్నంత!

By:  Tupaki Desk   |   26 May 2021 12:30 PM GMT
బురదలో బంగారం.. తీసుకున్నోళ్లకు తీసుకున్నంత!
X
స్వర్ణ ప్రియులూ.. ఇది విన్నారా? బురదలో బంగారం అంటా. అదీ తీసుకున్నోళ్లకు తీసుకున్నంత! అవును నిజమేనండి. ఆ బంగారు నదిలోని బురదలో బంగారం ఉంటుందట. అక్కడి ప్రజలకు అదే జీవనాధారం. వాళ్లు చేసే పనేంటో తెలుసా? ఉదయాన్నే నది తీరానికి వెళ్లి బురదను జల్లెడ పట్టడం. అలా తడి మట్టిలో గాలిస్తే స్వర్ణం లభిస్తుందట. దానిని మార్కెట్ లో విక్రయించి అక్కడి స్థానికులు పొట్టపోసుకుంటారు.

దక్షిణ థాయ్ లాండ్ లోని ఓ ప్రాంతంలో గోల్డెన్ మౌంటెన్ ఉంది. ఇది మలేషియాకు అనుసంధానించబడి ఉంటుంది. ఈ ప్రాంతంలో గతంలో బంగారు గని తవ్వకాలు జరిగాయి. కానీ ప్రస్తుతం ఆగిపోయాయి. ఆ నది తీరంలోని బురదలో ఇంకా బంగారం ఉంటుందట. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఉపాధి కరవైన వారందరూ బంగారం కోసం గాలించే పనిలో పడ్డారు. అందుకు చాలా కష్టపడాలి అని స్థానికులు అంటున్నారు.

బురదను జల్లెడతో గాలించాలని అక్కడ పనిచేసే మహిళ ఒకరు చెప్పారు. కనీసం గంటపాటు శోధిస్తే కానీ కొంతమొత్తంలో బంగారం దొరుకుతుందని అంటున్నారు. దొరికిన కొద్దిగ్రాముల బంగారాన్ని విక్రయించి ఆ రోజు వెల్లదీస్తామని పేర్కొన్నారు. గంట కష్టం పడితే దాదాపు ర.250 వస్తాయని ఆమె తెలిపారు. ఈ పనితో తాము చాలా సంతోషకరమైన జీవనాన్ని గడుపుతున్నామని చెప్పారు. ముస్లిం వేర్పాటువాదుల కారణంగా ఆ ప్రాంతం కాస్త భిన్నంగా ఉంటుందట. అక్కడ హోటళ్లు, రిసార్టులు ఏం ఉండవని చెబుతున్నారు. అభివృద్ది పెద్దగా జరగలేదని వెల్లడించారు.

కేవలం థాయ్ లాండ్ లోనే కాదు భారతదేశంలోనూ ఓ బంగారు నది ఉంది. ఆ నది ఇసుకలో బంగారు రేణువులు లభిస్తాయి. అక్కడి ప్రజలు బంగారాన్ని సేకరిస్తూ జీవనం సాగిస్తారు. జార్ఖండ్ లోని రత్నగ్రహలో స్వర్ణ రేఖ అనే నది ఉంది. జార్ఖండ్, పశ్చిమ బంగ,ఒడిషాల్లో ఈ నది ప్రవహిస్తుంది. గోల్డెన్ లైన్, ఉపనది కర్కారిలో బంగారు రేణువులు ఉంటాయని స్థానికులు తెలిపారు. కర్కారి నుంచి గోల్డెన్ లైన్ కు స్వర్ణ రేణువులు చేరుతాయని అంటుంటారు. అక్కడి వారు బంగారాన్ని గాలిస్తూ ఉపాధి పొందుతారు. తీసుకున్నోళ్లకు తీసుకున్నంత బంగారం లభిస్తుంది.