Begin typing your search above and press return to search.
బంగారం ధర.. లైఫ్ టైమ్ హై!
By: Tupaki Desk | 26 Aug 2019 12:41 PM GMTఇంతవరకూ కనీవిని ఎరగని రీతిలో బంగారం ధర పది గ్రాములకు నలభై వేల రూపాయలకు రీచ్ అయ్యింది. ఇన్ని రోజులూ గోల్డ్ ధరెంత అంటే..ముప్పై వేల రూపాయల చిల్లర అనే అభిప్రాయాలు అందరిలోనూ ఏర్పడ్డాయి. కొన్ని సంవత్సరాల కిందటే బంగారం పది గ్రాముల ధర ముప్పై వేల రూపాయలను దాటింది. చాలా కాలంగా ముప్పై వేల రూపాయలకు మించిన ధరలో కొనసాగుతూ ఉంది.
ముప్పై ఒకటి నుంచి.. అలా అలా పైకి ఎగబాకుతూ వచ్చింది. అయితే సోమవారం మార్కెట్లో పసిడి రికార్డు స్థాయి ధరను నమోదు చేసింది. పది గ్రాముల ధర నలభై వేల రూపాయలకు రీచ్ అయ్యి కొత్త రికార్డును సృష్టించింది. పదిగ్రాముల పసిడి ధర ఇప్పటి వరకూ చరిత్రలో ఎన్నడూ నలభై వేల రూపాయలకు రీచ్ కాలేదు. తొలిసారి అది జరిగింది. గత వారం రోజులుగా అయితే ధర మరింతగా పెరుగుతూనే ఉంది.
శ్రావణమాసం ముగిస్తే బంగారం ధర తగ్గుతుందనే భావన ప్రజల్లో ఉంది. అయితే ఇప్పుడు పెరుగుదలను గమనిస్తే మాత్రం అదేం జరిగేట్టుగా లేదు.
ఇక వెండి కూడా బంగారానికి ధీటుగా ధరలో పెరుగులను నమోదు చేసింది.కేసి వెండి ధర నలభై ఆరు వేల రూపాయలకు రీచ్ అయ్యింది. డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోతూ ఉండటం - ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు భారీగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో గోల్డ్ విలువకు రెక్కలు వచ్చాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.