Begin typing your search above and press return to search.

ధ‌ర‌ల‌కు రెక్క‌లు; దూసుకెళుతున్న బంగారం

By:  Tupaki Desk   |   24 Aug 2015 10:04 AM GMT
ధ‌ర‌ల‌కు రెక్క‌లు; దూసుకెళుతున్న బంగారం
X
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌ద‌న్న విష‌యం మ‌రోసారి రుజువైంది. జూలైలో తీవ్ర ఒత్తిడికి లోనై.. భారీగా ధ‌ర‌లు త‌గ్గి.. క‌ళ కోల్పోయిన ప‌సిడి.. త‌న పూర్వ వైభ‌వాన్ని సంత‌రించుకుంటోంది.

ఒక‌ద‌శ‌లో 10గ్రాముల స్వ‌చ్ఛ బంగారం (24 క్యారెట్లు) రూ.25వేల దిగువ‌కు ప‌డిపోవ‌టం.. ఒక ద‌శ‌లో రూ.24,900 వ‌ర‌కు (కొన్ని చోట్ల మాత్ర‌మే) వ‌చ్చింది. అయితే.. ఈ ధ‌ర చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధి మాత్ర‌మే ఉన్నా.. అది చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఎప్పుడైతే ప‌ది గ్రాముల బంగారం (24 క్యారెట్లు) పాతిక‌వేల‌కు ట‌చ్ చేసిందో.. ఇంకేముంది.. బంగారం ధ‌ర భారీగా ప‌డిపోతుంద‌ని.. ప‌దిగ్రాములు 22 వేల‌కు ప‌డిపోవ‌టం ఖాయ‌మ‌ని భారీగానే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.

మీడియాలోవ‌చ్చిన విశ్లేష‌ణ‌ల‌కు.. మార్కెట్ వ‌ర్గాల అంచ‌నాకు ఏమాత్రం సంబంధం లేద‌న్న విషయాన్ని తుపాకీ గ‌తంలోనే చెప్పింది. అంతేకాదు.. బంగారం ధ‌ర త‌గ్గే అవ‌కాశం చాలా త‌క్కువ‌ని.. కొనాల‌నుకున్న వారికి ఇదే మంచి టైమ‌ని చెప్పింది. ఇదిలా ఉంటే.. గ‌త సోమ‌వారం నుంచి భారీగా పెరుగుతున్న బంగారం.. గ‌త వారం మొత్తం పెరుగుతూనే ఉంది. తాజాగా బంగారం ధ‌ర మ‌రింత ఎగ‌బాకింది.

అంత‌ర్జాతీయ కార‌ణాల వ‌ల్ల స్టాక్ మార్కెట్ కుదేలు కావ‌టం.. ముడిచ‌మురు డిమాండ్ ఏ మాత్రం లేక‌పోవ‌టంతో బంగారానికి మించింది లేద‌న్న‌ట్లుగా త‌యారైంది.

దీంతో.. ప‌దిగ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధ‌ర వారాంతానికి ఉన్న‌ రూ.26,800గా ఉన్న దానికి భిన్నంగా సోమ‌వారం బాగా పెరిగింది. క‌డ‌ప‌టి స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌స్తుతం 24 గ్రాముల స్వ‌చ్ఛ బంగారం ప‌ది గ్రాములు రూ.27,219గా ఉండ‌గా.. 22క్యారెట్ల ఆర్న‌మెంట్ బంగారం ధ‌ర 10గ్రాములు.. 25,450గా ఉంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ప‌రుగులు పెడుతున్న బంగారం ధ‌ర‌కు భిన్నంగా వెండి ధ‌ర మాత్రం కాస్త త‌గ్గింది. శ‌నివారం వెండి ధ‌ర కేజీ రూ.36,204 ఉంటే.. సోమ‌వారం మ‌ధ్యాహ్నానానికి కేజీ ధ‌ర రూ.35,887గా ఉంది. ఇక‌.. బంగారం ధ‌ర రానున్న వారంలో మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.