Begin typing your search above and press return to search.

ఆ రాత్రి 15000కేజీల బంగారం అమ్మేశారు

By:  Tupaki Desk   |   10 Dec 2016 4:58 AM GMT
ఆ రాత్రి 15000కేజీల బంగారం అమ్మేశారు
X
దేశాన్నిమార్చేయటం సాధ్యమేనా? అంటే.. చాలా కష్టమన్న భావన కలిగే వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. దేశం మొత్తాన్ని మార్చేయటం కంటే కూడా వ్యక్తులుగా ఎవరికి వారు.. వారిలో వారికి మార్పులురానంత కాలం.. ఎవరెన్ని చెప్పినా.. ఎంత మొత్తుకున్నా మార్పు వచ్చే అవకాశమే లేదన్న విషయం మరోసారిస్పష్టమైంది. డ్రాయింగ్ రూంలలో కూర్చొని నీతులు చెప్పే చాలామంది.. తమ వరకూ వచ్చేసరికి మాత్రం చెప్పిన నీతుల్ని పక్కన పెట్టేసి.. తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూసుకుంటారన్న విషయం స్పష్టమైంది.

దేశంలో ఎప్పుడు.. ఎలాంటి చర్యలు తీసుకున్నా.. కొత్త నిబందనలు తీసుకొచ్చేది.. సామాన్య.. మధ్యతరగతి జీవులు మాత్రమే బలిపశువులు అయ్యేదన్న విషయం తాజాగా కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం చెప్పకనే చెప్పేసింది. నవంబరు 8 రాత్రి దాదాపు 8.30 గంటల సమయంలోనోట్ల రద్దుకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రధాని మోడీ తనకు తానుగా వెల్లడించారు.

ఆయన నోట నుంచి మాట విన్న వెంటనే.. ఏం చేయాలో తోచక చేష్టలుడిగినట్లుగా ఉండిపోతే.. కొందరు మాత్రం ఆ వేళలో కూడా షార్ప్ గా రియాక్ట్ అయి వెను వెంటనే నష్టనివారణ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తాజాగా వెల్లడైన సమాచారం చూస్తే అర్థమవుతుంది. ప్రధాని నోటి నుంచి పెద్ద నోట్ల రద్దు మాట విన్న వెంటనే.. పలువురు బడా బాబులు తమ వారిని రంగంలోకి దింపేశారు.

తమ దగ్గరి పెద్ద నోట్లను తమదైన శైలిలో మార్చేసి వాటిని బంగారం రూపంలోకి మార్చేశారు. ఇందుకోసం తమకున్న పలుకుబడిని విపరీతంగా వినియోగించినట్లుగా వార్తులు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా భారత బంగారం.. ఆభరణాల వర్తకుల సంఘం తాజాగా ఒక సమాచారాన్ని వెల్లడించింది. ప్రధాని నోటి వెంట పెద్ద నోట్ల రద్దు మాట వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే దాదాపు 15వేల కిలోల బంగారన్ని అమ్మినట్లుగా సదరు సంఘం స్పష్టం చేస్తోంది. సాధారణ రోజుల్లో ఒక నెలలో దేశ వ్యాప్తంగా అమ్ముడయ్యే బంగారంలో ఇది 20 శాతం కావటం గమనార్హం. రాత్రివేళ.. అది కూడా గంటల వ్యవధిలోనే ఇంత భారీ మొత్తంలో బంగార అమ్మకాలు జరగటం విశేషంగా చెప్పాలి. ఇంత భారీగా బంగారాన్ని చేతులు మార్చేసిన ఉదంతంపై అధికారులు ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. నవంబరు 7 నుంచి 11 వరకు జరిగిన అనుమానాస్పద బంగారు లావాదేవీలపై ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. కొందరు వ్యాపారుల అమ్మకాల వివరాల్ని తమకు అందించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారిచ్చే సమాచారాన్ని లెక్కేసి.. దాని మొత్తం కానీ లెక్కేసి.. ఇవన్నీ ఒక కొలిక్కి వస్తే మరెన్ని సంచలన కథనాలు తెర మీదకు వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.