Begin typing your search above and press return to search.
భారత్‌లో బంగారం కొనేవాళ్లు కరువయ్యారా?
By: Tupaki Desk | 4 July 2015 4:27 AM GMTబంగారానికి భారతీయులకు మధ్యనున్న అవినాభావ సంబంధం అంతాఇంతా కాదు. ఏ మాత్రం అవకాశం చిక్కిన ఎంతో కొంత బంగారం కొనేసి తృప్తి చెందే వైఖరి భారతీయుల్లో కనిపిస్తుంటుంది.
ఇక.. బంగారం ధర తగ్గితే బంగారం షాపుల దగ్గర క్యూలు కట్టటం కూడా మామూలే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే.. దేశీయంగా బంగారం ధర తగ్గినప్పటికీ బంగారం అమ్మకాలు మాత్రం జోరుగా లేకపోవటం గమనార్హం.
ఔన్స్ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే రూ.500 నుంచి రూ.వెయ్యి మధ్యలో డిస్కౌంట్ల రూపంలో ఇస్తున్నా కొనేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావటం లేదు. ఎందుకిలా అంటే.. కారణం లేకపోలేదని ఆభరణాల వర్తకులు చెబుతున్నారు. ధరలు తగ్గినా కొనుగోలుదారులు బంగారం కొనటానికి ముందుకు రావటం లేదని.. దీనికి కారణం భారతావనిలో శుభకార్యాలకు ఇది సరైన సమయం కాకపోవటం.. పండుగల సీజన్ దూరంగా ఉండటం.. అన్నదాతలు పొలం పనుల్లో బిజీగా ఉండి.. తమ వద్దనున్న సొమ్ముల్ని పెట్టుబడిగా పెట్టిన నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయని చెబుతున్నారు.
అన్నీ అనుకున్నట్లే జరిగితే ఆగస్టు.. సెప్టెంబర్ నాటి నుంచి బంగారం అమ్మకాలు జోరు అందుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. బంగారం ధర కూడా కాస్తంత పెరిగే వీలుందని చెబుతున్నారు. సెప్టెంబర్.. అక్టోబరు మధ్య కాలంలో మాత్రం ఒక వారం రోజుల పాటు బంగారం ధర బాగా పడిపోయే వీలుందన్న అంచనా వేస్తున్నారు.