Begin typing your search above and press return to search.

పుష్కరాల్లో 'ఇంద్ర' పూజారులు

By:  Tupaki Desk   |   23 July 2015 11:44 AM GMT
పుష్కరాల్లో ఇంద్ర పూజారులు
X
పుణ్యక్షేత్రాల్లో, పుణ్యతీర్థాల్లో మోసాలు, దొంగతనాలు ఎప్పుడూ ఉండేవే... గోదావరి పుష్కరాల్లోనూ అక్కడక్కడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇంద్ర సినిమాలో మాదిరిగా గోదావరి పుష్కరాల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. పూజలు చేయిస్తామంటూ మొదలుపెట్టి గంగా నదిలో స్నానానికి పంపించి యాత్రికుల వద్ద ఉన్న బంగారం, డబ్బు మొత్తం దోచుకెళ్లిన సీను ఇంద్ర సినిమాలో ఉంటుంది... పుష్కరాల్లోనూ రీసెంటుగా అలాంటిదే జరిగింది.

పుష్కరాలకు వచ్చిన ఓ వృద్ధ దంపతులను నకిలీ పూజరి ఒకరు నమ్మించి మోసగించాడు. పూజాదికాలు ముగిసిన తరువాత వారిని నదీస్నానానికి పంపించి వాటి సామగ్రిని మొత్తం తన వద్ద ఉంచాడు. తానైతే జాగ్రత్తగా ఉంచుతానని నమ్మించి మరీ మోసగించాడు. వారు అలా స్నానానికి దిగగానే ఆ సామాన్లతో ఉడాయించాడు.

ఇంతకుముందు కూడా రాజమండ్రిలోనే ఓ ఘాట్ వద్ద దొంగలు తమ చేతివాటం చూపించారు. అయితే, భక్తులు అరవడం, పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించడంతో నదిలోకి దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే, భద్రతా సిబ్బంది ఆ దొంగలను చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఈ సంఘటనలు.. పుష్కర సమయంలో దొంగతనాలపై పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చెబుతున్నాయి.