Begin typing your search above and press return to search.
మీకు తెలుసా: ఆ ఎంపీ ప్యాలెస్ లో బంగారు గోడలు.. ఖరీదైన వస్తువులు!
By: Tupaki Desk | 25 May 2021 11:45 AM GMTమూడంతస్తుల భవనంలో బంగారంతో పోత పోసిన గోడలు. మొత్తం 400 గదులతో నిర్మించిన ఆ రాజభవనంలో అతిపెద్ద హాల్. ఖరీదైన షాండ్లియర్లు. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? ఈ విశేషాలన్నీ ఓ భాజపా ఎంపీ ప్యాలెస్ కు చెందినవి. ఆ ఎంపీ ఎవరో కాదండోయ్ మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యువనేత, భాజపా ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా. వంశపారంపర్యంగా ఈ రాజభవనం ఆయనకు లభించింది.
రాయల్ సిటీ గ్వాలియర్ లో ఉండే ఈ రాజభవనం పేరు జై విలాస్ ప్యాలెస్. ఎంపీ జ్యోతిరాదిత్య ఇందులోనే నివాసం ఉంటున్నారు. ఇది చూడడానికి క్లాసిక్ యూరోపియన్ స్టైయిల్ లో ఉంటుంది. కానీ లోపల మాత్రం టుస్కన్, ఇటాలియన్, కోరింథియన్ డిజైన్లలో రూపొందించారు. గ్వాలియర్ ను పాలించిన హింధూ మరాఠా రాజవంశం సింధియా రాజు జీవాజీరావు సింధియా దీనిని కట్టించారు. 12,40,771 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ రాజభవనాన్ని నిర్మించారు. ఇంతటి విశిష్టమైన భవనాన్ని నిర్మించడానికి ఓ పెద్ద కారణం ఉందట!
1876లో వేల్స్ యువరాజు జార్జ్, యువరాణి మేరీ భారతదేశానికి సందర్శించడానికి వచ్చారట. వారికోసమే అతి విలాసవంతమైన ఈ ప్యాలెస్ ని ఎంతో ఖర్చు చేసి నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. మూడు అంతస్తుల్లో మొదటిది టుస్కన్, రెండో ఇటాలియన్, మూడోది కోరింథియన్ డిజైన్లలో ఉంటాయి. దర్బార్ హాల్ లో 12.5 మీటర్ల పొడవు గల షాండ్లియర్ ఉంటాయి. ఒక్కక్కటి 250 బల్బులు కగిలి ఉండి 3,500 కేజీల బరువుతో ఉంటుందట. ఈ బరువులను సీలింగ్ మోయగలదా? అన్న సందేహంతో నిర్మాణ సమయంలో సీలింగ్ లకు ఏనుగులను వేలాడదీసి మరీ పరిక్షించారట.
హాల్ గోడలు మొత్త బంగారు మయం. 560 కేజీల బంగారంతో గోడలకు స్వర్ణపోత పోశారు. నియోక్లాసికల్, బరాకీ స్టైయిల్ లో హాల్ ను రూపొందిచారు. ఈ హాల్ లోనే అప్పట్లో సమావేశాలు జరిగాయని చెబుతుంటారు. బ్రిటిష్ లెఫ్టినెంట్ కల్నల్ సర్ మైఖేల్ మ్యాన్షన్ దీనిని డిజైన్ చేశారు. అప్పట్లోనే రూ.కోటి ఖర్చు చేసి దీనిని రూపొందించారు. ప్రస్తుతం ఈ రాజభవనం విలువ రూ.10వేల కోట్ల వరకు ఉంటుదని ఒక అంచనా.
ఈ ప్యాలెస్ లో వెండితో తయారు చేసిన రైలు నమూనా ఉంటుంది. అతిథిలు కోసం సిగార్లు, మద్యం తీసుకురావడానికి దీనిని ఉపయోగిస్తారట. 35 గదుల్లో ప్రస్తుతం ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. సింధియా రాజవంశానికి చెందిన వెండి రథం, వెండి బగ్గీలు, పల్లకీలు, లగ్జరీ కార్లు, ఝాన్సీ లక్ష్మిభాయి కాలంనాటి వస్తువులు, ఔరంగజేబు, షాజహాన్ కాలంనాటి కత్తులు ఉన్నాయని సమాచారం. ఈ ప్యాలెస్ లో ఓ పెద్ద గ్రంథాలయం ఉంది. ఇందులో 5 వేల పుస్తకాలు ఉన్నట్లు తెలుస్తోంది.