Begin typing your search above and press return to search.
గోల్డెన్ బాబా కహానీ చదవాల్సిందే
By: Tupaki Desk | 18 Jan 2016 1:04 PM GMTఎవరైనా బాబా వస్తుంటే పూజ్యభావంతో భక్తితో చేతులు జోడించి నిలబడటం కామన్. కానీ.. ఇప్పుడు చెప్పే బాబా వ్యవహారం కాస్త డిఫరెంట్. ఆయన నడిచి వస్తుంటే ఆయనకు దగ్గరగా నిలుచునే వారే కానీ.. కాస్త దూరంగా ఉన్నోళ్లు కూడా చేస్తున్న పనిని వదిలేసి ఆయన్ను నోరు తెరుచుకొని చూస్తుంటారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కూడా నోటి వెంట ఆయనకు సంబంధించిన మాటలే వస్తాయి. ఇంతకీ సదరు బాబా స్పెషాలిటీ ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. సదరు బాబా ఒంటి మీద దాదాపుగా గోల్డ్ తో కవర్ చేస్తుంటుంది. దాదాపు మూడున్నర కేజీలకు పైనే బంగారాన్ని ధరించి.. చేతికి వజ్రాల వాచీ పెట్టి ఠీవీగా నడిచి వచ్చే సదరు బాబా వైభవానికి నోటి మాట రాని పరిస్థితి.
ఇటీవల హరిద్వార్ లోని అర్ధ కుంభమేళాకు హాజరై.. అక్కడి వారి దృష్టిని విపరీతంగా ఆకర్షించారు ఈ బాబా. లక్షలాది మంది వచ్చే అర్థకుంభమేళాలో ఈ బాబా సో స్పెషల్ గా నిలిచారు. గంగానదిలో స్నానం చేసి వస్తున్న ఈ గోల్డెన్ బాబాను చూసి అందరి కళ్లు మెరిసిపోయిన పరిస్థితి. కాషాయ వస్త్రాలతో.. రుద్రాక్ష మాలతో సింఫుల్ గా ఉండాల్సిన బాబు అంతేసి బంగారంతో మెరిసిపోవటం టాక్ ఆప్ ద టౌన్ గా మారింది. ఇంతమంది కళ్లల్లో పడిన బాబా మీడియా కంట్లో పడకుండా పోతారా?
ఇంతకీ ఈ గోల్డెన్ బాబు పాస్ట్ లైఫ్ కాస్త ఆశ్చర్యంగా.. మరికాస్త ఆసక్తికరంగా ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఇక్కడో విషయం చెప్పాలి. గోల్డెన్ బాబా అని మనం ఇన్నిసార్లు అనుకుంటున్నాం కానీ.. ఇదే మాట ఎవరి నోట వెంట వింటే ఆయన శిష్యగణానికి కోపం వచ్చేస్తుంది. ఈ మాటే కాదు.. బాబాకి ఇంత బంగారం ఎందుకన్న మాట వింటే మాత్రం కస్సుమంటారు. బంగారం మాదిరి స్వచ్ఛతకు ప్రతిరూపమని.. ఆ విషయాన్ని చెప్పేందుకే ఆయన అంత బంగారం ధరిస్తారని చెబుతారు.
బాబా కావాటానికి ముందు ఆయనేం చేసే వారన్న విషయానికి వెళితే.. ఆయన అసలు పేరు సుథీర్ కుమార్ మక్కడ్. వయసు 53 ఏళ్లు. గతంలో ఢిల్లీలో వస్త్ర వ్యాపారిగా ఉండేవారు. వ్యాపారంలో భాగంగా చాలానే పాపాలు..పొరపాట్లు చేశాడట. వాటికి ప్రాయశ్చిత్తంగా సన్యాసం స్వీకరించాడట. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం వారి ఇబ్బందులు పడే తల్లిదండ్రుల అవసరాలను.. థార్మిక కార్యక్రమాల కోసం సాయం చేస్తూ ఉంటారని చెబుతుంటారు. ఇక.. అయ్యగారి వైభవం గురించి నాలుగు మాటలు చెప్పాల్సినవి ఉన్నాయి. బాబాగారి వంటి మీద ఉన్న బంగారం విలువ రూ.3కోట్ల వరకు ఉంటుందట. ఇక.. ఆయన పెట్టుకునే వజ్రాల వాచీ ధర రూ.27లక్షలు ఖరీదు చేస్తుందని చెబుతున్నారు. జనాలు అనుకునే పేరుకు తగ్గట్లే బంగారు బాబా రేంజ్ కనిపిస్తుంది కదూ.