Begin typing your search above and press return to search.

ఇప్పుడా రిసార్ట్స్ దగ్గర ఏం బోర్డు పెట్టారంటే..

By:  Tupaki Desk   |   18 Feb 2017 12:15 PM GMT
ఇప్పుడా రిసార్ట్స్ దగ్గర ఏం బోర్డు పెట్టారంటే..
X
గడిచిన పది.. పన్నెండు రోజులు యావత్ దేశాన్ని ఆకర్షించిన తమిళరాజకీయాల్లో అందరి నోట అదే పనిగా నానిన కొద్ది మాటల్లో.. ‘గోల్డెన్ బే రిసార్ట్స్’’ ఒకటి. శశికళ వర్గానికి చెందిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్ని వ్యూహాత్మకంగా రిసార్ట్స్ కు తరలించి.. అక్కడే క్యాంప్ చేపట్టారు. మెజార్టీ ఎమ్మెల్యేల్ని ఉంచేయటం ద్వారా ఈ రిసార్ట్స్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది. తమిళనాడు రాజకీయాలు మొత్తం ఈ రిసార్ట్స్ చుట్టూనే తిరిగాయి.

ముఖ్యమంత్రి కావాలనుకున్న చిన్నమ్మ.. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల్ని ఈ రిసార్ట్స్ వద్దకుతరలించటం.. ఇందులో కొందరు ఎమ్మెల్యేలకు ఇష్టం లేకున్నా.. బలవంతంగా బంధించారన్న ఆరోపణ రావటంతో సంచలనంగా మారింది. చివరక పోలీసులు రంగ ప్రవేశం చేయటం.. ఎమ్మెల్యేల వాంగ్మూలాల్ని రికార్డు చేయటం లాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. చిన్నమ్మ మీద ఉన్న అక్రమాస్తుల కేసులో తీర్పు వచ్చి.. ఆమె దోషిగా కోర్టు నిర్దారించటంతో.. కొత్త సీఎంను నిర్ణయించటం దగ్గర నుంచి.. భవిష్యత్తు ప్రణాళిక మొత్తానికి ఈ రిసార్ట్స్ వేదికగా మారింది. దాదాపు 12 రోజుల పాటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు అతిధ్యం ఇచ్చిన ఈ రిసార్ట్స్ నుంచి ఈ ఉదయం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

వారు అలా వెళ్లారో లేదో.. రిసార్ట్స్ కు కొన్ని కాగితాల్ని అంటించింది యాజమాన్యం. రిసార్ట్స్ ప్రస్తుతం అండర్ మొయింటైనెన్స్ లో ఉందని పేర్కొంటూ సేవల్ని నిలిపివేశారు. చిన్మమ్మ క్యాంప్ ఎపిసోడ్ కు ముందు.. ఈ రిసార్ట్స్ కు చాలా మంది పేరు ఉందని చెబుతారు. తాజాగా చోటు చేసుకున్నపరిణామాలతో.. ఈ రిసార్ట్స్ కు చెడ్డపేరు రావటంతో పాటు.. ఈ రిసార్ట్స్ కు ఎవరూవెళ్లవద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. ఎమ్మెల్యేలు అందరూ వెళ్లిపోయిన వెంటనే.. రిసార్ట్స్ ను తాత్కాలికంగా మూసివేయటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/