Begin typing your search above and press return to search.

గోల్డెన్ ఛాన్స్ కొట్టిన ఉత్తమ్ .. కానీ, అదొక్కటే మైనస్ !

By:  Tupaki Desk   |   13 July 2021 5:40 AM GMT
గోల్డెన్ ఛాన్స్ కొట్టిన ఉత్తమ్ .. కానీ, అదొక్కటే మైనస్ !
X
ఉత్తమ్ కుమార్ రెడ్డి .. తెలంగాణ కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ అంతో ఇంతో ప్రాభల్యం చూపిస్తూ వస్తుంది అంటే అది ఉత్తమ్ చలవే అని చెప్పాలి. పార్టీలో ఉన్న అసమ్మతిని తగ్గించుకుంటూ బలమైన టిఆర్ ఎస్ ను ఎదుర్కొంటు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని తన భుజాలపై మోశారు. తాజాగా ఆయన్ని ఆ పదవి నుండి తప్పించి , టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి జాయిన్ అయిన ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి కి అధిష్టానం పీసీసీ చీఫ్ పదవిని అందించింది. ఇది అందరూ ముందు నుండి ఊహించిందే. అయితే, పీసీసీ కోల్పోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం గోల్డెన్ ఛాన్స్ ఇవ్వబోతుంది. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఉత్తమ్ పేరు ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం కీలక పదవి కోసం పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత కాంగ్రెస్‌ లోక్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి స్థానంలో మరొకరిని నియమించాలని పార్టీ అధిష్ఠానం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది నెలలగా ఈ స్థానంలో కొత్త వారిని నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ అనుకుంటూ వస్తుంది. అయితే, కరోనా కారణంగా ఈ నిర్ణయం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూవస్తుంది. ఇక, ఈ నెల 19నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరగనుండటంతో ఈ లో గానే లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతను డిసైడ్ చేయటం అనివార్యంగా మారింది. ఈ మేరకు ఇప్పటికే టెన్ జన్ పథ్ లో చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీ వ్యవహరించనన స్పష్టం చేయటంతో ఇప్పుడు కొత్తగా బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దాని పైన చర్చ జరుగుతోంది.

అందులో భాగంగానే గతంలో కాంగ్రెస్ అధినాయకత్వానికి తమ అసమ్మతి తెలియజేస్తూ సంస్థాగత మార్పులు చేయాలని 23 మంది నేతలు లేఖ రాసారు. ఆ సమయంలో ఆ లేఖ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. . ఇక, ప్రస్తుతం తాజాగా కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేతగా ఆ 23 మంది లేఖ రాసిన నేతల్లో ఎవరికైనా ఇవ్వాలనే ప్రతిపాదన పైన కొద్ది రోజులుగా చర్చలు సాగుతున్నాయి. అయితే, అసమ్మతిని లేఖ ద్వారా తెలియచేయటం ఒక రకంగా తమకు ధిక్కరించినట్లుగా కాంగ్రెస్ అధినాయకత్వం భావించింది. వారి పైన చర్చలకు నిర్ణయం తీసుకొనే పరిస్థితులు లేకపోయినా కీలక పదవుల్లో వారికి అవకాశం ఇస్తారా అనేది మాత్రం సందేహమే.

ఇదే సమయంలో పలువురి పేర్లు ఈ పదవి కోసం రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా.. శశిథరూర్‌, మనీశ్‌ తివారీ ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటుగా గౌరవ్‌ గొగొయి, రన్‌వీత్‌ సింగ్‌ బిట్టూ, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్లు కూడా వినబడుతున్నాయి. శశిథరూర్‌, మనీశ్ తివారీ జీ-23 నేతల జాబితాలో ఉన్నారు. దీనితో వీరిద్దరిని కాదనుకుంటే మిగిలిన ముగ్గురిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి నిబంధన ఇప్పుడు కఠినంగా అమలు జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో అధిర్‌ రంజన్‌ చౌదరిని తొలగింపు ఖాయంగా కనిపిస్తోంది. అధిర్‌ ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఉండటంతో పాటు లోక్‌సభలో కాంగ్రెస్‌సభాపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. రెండు పదవులు నిర్వహిస్తున్న మిగతా వారిని కూడా ఒకదాన్నుంచి రిలీవ్‌ చేయనున్నారు.

ఈ సమయంలో తెలంగాణ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు సైతం పరిశీలనలో ఉండటంతో పాటుగా ..ఈ మధ్య కాలంలోనే రాహుల్ తో చర్చలు జరిగినట్లు రాజకీయ వర్గాల సమాచారం. అయితే, ఉత్తమ్ కు పార్లమెంటరీ వ్యవహారాల్లో అంతగా అనుభవం లేకపోవటం కొంతమేర మైనస్ గా మారే అవకాశం ఉంది. దీంతో పాటుగా..బలమైన బీజేపీని లోక్ సభలో ఎదుర్కోవాలంటే సభా వ్యవహారాల పైన పట్టు ఫ్లోర్ మేనేజ్ మెంట్, మంచి వాగ్దాటి అవసరం ఉన్న నేతను ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఉత్తమ్ పేరు రేసులో ఉన్న ఆయన ఎంపిక అంత సులువు కాదనే వాదన తెలంగాణ కాంగ్రెస్ లో వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉత్తమ్ కనుక ఈ కాంగ్రెస్‌ లోక్‌ సభాపక్ష నేతగా ఎన్నికైతే గోల్డెన్ ఛాన్స్ కొట్టినట్టే.