Begin typing your search above and press return to search.
శవాల పునాది మీద పుట్టిన పార్టీ వైకాపా
By: Tupaki Desk | 31 Aug 2015 5:53 AM GMTమనం విక్రమ్ అపరిచితుడు సినిమాను చూశాం...కానీ మాజీ మంత్రి, రాజోలు టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాత్రం జగన్ లో అపరిచితుడుని చూశానని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సోమవారం శాసనసభ సమావేశాల్లో పుష్కరాల తొక్కిసలాటలో చనిపోయిన మృతులకు సంతాప తీర్మానం సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రోజు కేవలం చంద్రబాబు నాయుడు షూటింగ్ కోసం భక్తులను ఆపేయడంతోనే తొక్కిసలాటి జరిగి 29 మంది భక్తులు చనిపోయారని...ఇందుకు చంద్రబాబుదే పూర్తి బాధ్యత అని జగన్ విమర్శించారు.
జగన్ మాటలకు పలువురు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యే లు కౌంటర్ ఇచ్చారు. మంత్రి యనమల మాట్లాడుతూ జగన్ మాట్లాడే తీరు సరిగా లేదని హితవు చెప్పారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు జరిగిన 12 రోజుల్లో ఏం జరిగిందో ఈ రోజంతా డిబేట్ పెట్టి చర్చిద్దామని జగన్ కు సవాల్ విసిరారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ ఆ రోజు జరిగిన సంఘటనకు చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారని..144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలను, 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలను చంద్రబాబు ఎంత గొప్పగా నిర్వహించారో..ఆయన ఈ పుష్కరాల ద్వారా తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎలా చాటారో ప్రపంచం మొత్తం చూసిందన్నారు.
ఎవరైనా ఏదైనా సందర్భంలో చనిపోతే వారి పట్ల సానుభూతి చూపాలని...కానీ జగన్ మాత్రం ఓ అపరిచితుడిలా ప్రవర్తిస్తూ శవ రాజకీయం చేస్తున్నాడని గొల్లపల్లి ఘాటుగా విమర్శించారు. శవాలమీద కూడా రాజకీయం చేసిన ఘనత ఆయనదే అని..శవాల పునాదుల మీద పుట్టిన పార్టీయే వైకాపా అని ధ్వజమెత్తారు. దీనిపై జగన్ అవనసరంగా రాద్దాంతం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.