Begin typing your search above and press return to search.
శానిటైజర్ అతిగా వాడితే నష్టమే..
By: Tupaki Desk | 29 May 2020 12:30 AM GMTమహమ్మారి వైరస్ ప్రబలకుండా ముందు జాగ్రత్తగా శానిటైజర్ వాడాలని ప్రభుత్వం, వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ప్రజలంతా శానిటైజర్‌ను ప్రజలు వినియోగిస్తున్నారు. దాంతో వైరస్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వైరస్ వ్యాపించకుండా శానిటైజర్ చేతులకు వాడుతూ అప్రమత్తంగా ఉన్నారు. ఈ మేరకు కార్యాలయాలు, సంస్థల్లో ప్రవేశ ద్వారాల వద్ద శానిటైజర్ ఉంచుతున్నారు. వచ్చేవారు.. వెళ్లేవారు విధిగా శానిటైజర్ వాడి చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. ప్రజలు కూడా తమ వెంట శానిటైజర్ తప్పక పెట్టుకుని తరచూ వినియోగించుకుంటున్నారు. అయితే ఏదైనా అతిగా వినియోగిస్తే నష్టమేనని అందరికీ తెలిసిందే. అతి సర్వత్రా వర్జయేత్ అన్నది శానిటైజర్ విషయంలోనూ వర్తిస్తుందని పలువురు చెబుతున్నారు.
అధికంగా శానిటైజర్ వాడడంతో నష్టమే ఉందని చెబుతున్నారు. శానిటైజర్ అధికంగా వాడితే మన అరచేతుల్లోని మంచి బ్యాక్టీరియా చనిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ మంచి బ్యాక్టీరియా మన చర్మాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా ఉపయోగపడుతుంది. అలాంటి మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లకపోతే రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదం చేస్తుంది. ఇప్పుడు మహమ్మారి వైరస్ రాకుండా ఉండేందుకు శానిటైజర్ అధికంగా వాడుతుంటే మన చేతుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా శక్తివంతంగా తయారవుతుంది. మంచి బ్యాక్టీరియా నశించి చెడు బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. శానిటైజర్‌కు అలవాటుపడి అది శక్తిని పెంచుకుంటుంది. అందుకే శానిటైజర్ తక్కువ వాడాలని సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా సబ్బు,నీరు వంటివి వాడాలని సూచిస్తున్నారు.
సబ్బు, నీరు అందుబాటులో ఉంటే శానిటైజర్ వాడనవసరం లేదు. 20 సెకన్ల పాటు సబ్బు నీళ్లతో చేతుల్ని కడుక్కోవాలి. ఆ విధంగా చేతుల్లో ఉండే క్రిముల్ని తరిమికొట్టవచ్చని ‘యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ తెలిపింది. చేతులకు విపరీతంగా దుమ్ముధూళీ అంటుకుంటే శానిటైజర్‌ను వాడొద్దు. చేతులు ఎక్కవ అపరిశుభ్రంగా ఉంటే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు ఇంకా అపరిశుభ్రతను సృష్టిస్తాయని ఆ సంస్థ వెల్లడించింది. అలా చేస్తే క్రిముల్ని చంపడంలో విఫలమవుతాయని హెచ్చరిస్తోంది. పక్కవారు తుమ్మినా, దగ్గినా కొంతమంది వెంటనే శానిటైజర్ రాసుకోవడం తప్పు. అలా చేస్తే ఎలాంటి లాభం ఉండదు. గాల్లోని క్రిములను శానిటైజర్ చంపలేదు. దీంతోపాటు శానిటైజర్‌కు చిన్నపిల్లలను దూరంగా పెట్టడం ఉత్తమం. పిల్లలు శానిటైజర్‌ను వాడితే వారి శరీరంలోకి వెళ్లి తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
అందుకే రోగాల భయంతో శానిటైజర్‌ను తెగ వాడొద్దని తెలిసిందిగా. అవసరమైనప్పుడు వాడండి. ఇంట్లో ఉన్నప్పుడు తెగ వాడనవసరం లేదు. బయటకు వెళ్లినప్పుడు, ఉద్యోగానికి వెళ్లినప్పుడు శానిటైజర్ వాడాలి.