Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్.. దిగివచ్చిన పాజిటివిటీ రేటు
By: Tupaki Desk | 5 Feb 2022 8:30 AM GMTదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 1,27,952 మంది వైరస్ బారిన పడ్డారు. నిన్నటి తో పోల్చితే కేసులు సుమారు 14 శాతం తగ్గినట్లు అధికారులు తెలిపారు. అంతేగాకుండా పాజిటివిటీ రేటు కూడా అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం 9.7 శాతం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం వెలుగు చూసిన కేసుల ప్రకారం భారత్ లో పాజిటివిటి రేటు 9.2 గా నమోదు అయ్యింది. కానీ ఒక్కసారిగా 40 వేలకు పైగా కేసులు తగ్గడంతో పాజిటివిటి రేటు దిగివచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. క్రమక్రమంగా తక్కువ కేసులు నమోదు కావడం అధికారుల కి కొంత ఊరటనిస్తుంది.
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఒక్కరోజే సుమారు రెండు లక్షల ముప్పై వేలకు పైగా మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో యాక్టివ్ కేసులు ప్రస్తుతం 13 లక్షలు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరో వైపు క్రియాశీల రేటు కూడా తక్కువగా ఉంది. కేవలం 3.16గా నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య తాజాగా నాలుగు కోట్లకు చేరిందని అధికారులు చెప్పారు. రికవరీ రేటు 95.64శాతంగా నమోదు అయినట్లు తెలిపారు.
దేశంలో కేసులు తగ్గు ముఖం పట్టినా కానీ మరణాలు పెరుగుతున్నాయి. వరుసగా మరో రోజు వెయ్యికి పైగా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,01,114కు చేరింది. కొత్తగా 1,059 మంది వైరస్ తో మరణించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో ఎక్కువ మరణాలు కేవలం దక్షిణాది రాష్ట్రం అయిన కేరళ నుంచి నమోదు అయ్యాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే వైరస్ తో పోరాడేందుకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కేవలం ఒక్క శుక్రవారం లోనే 47.53 లక్షల మందికి పైగా టీకాలు వేసిననట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తం డోసుల సంఖ్య 1,68,98,17,199కు చేరింది.