Begin typing your search above and press return to search.
కశ్మీర్ రాజకీయ నేతలకు గుడ్ న్యూస్... ఏపీ, తెలంగాణకు కూడానా...!
By: Tupaki Desk | 6 Aug 2019 6:19 AM GMTఎవరు ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దశాబ్దాల కశ్మీర్ చరిత్రను తిరగరాస్తూ సోమవారం రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా...జమ్మూ-కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలితం ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ ను... లఢక్ ను పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. అలాగే ‘జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు-2019’కు పెద్దల సభ ఆమోద ముద్ర కూడా వేసింది.
ఇక విభజన ప్రక్రియ పూర్తవ్వడంతో జమ్మూ-కశ్మీర్ విషయంలో కేంద్రం మరో ముందడుగు వేయనుంది. విభజన జరగడంతో జమ్మూ-కశ్మీర్ లో అసెంబ్లీ సీట్లు పెంపుకు కేంద్రం సిద్ధమైంది. మొన్నటివరకు ఇక్కడ మొత్తం 87 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే లఢక్ లో 4 స్థానాలు ఉండేవి. అయితే ఇది పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతం కావడంతో... ఇక్కడ అసెంబ్లీ స్థానాలు ఉండవు. ఇక జమ్మూ-కశ్మీర్ లో ఉన్న 83 స్థానాలని పునర్విభజించి 114 అసెబ్లీ స్థానాలు చేయబోతుంది. దీనికి సంబంధించి కేంద్రం ఓ కమిషన్ ని ఏర్పాటు చేయనుంది.
అయితే గతంలో 2026 వరకు అసెంబ్లీ, లోక్ సభ సీట్లు పునర్వభజించకూడదని పార్లమెంట్ లో చట్టం చేసింది. కానీ ఇప్పుడు జమ్మూ-కశ్మీర్ విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల పునర్విభజన ఉండటంతో....కేంద్రం ఆ సీట్లని పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా అసెంబ్లీ సీట్ల పెంపుకి సంబంధించిన అంశం ఉంది. దీని మీద గత ఐదు సంవత్సరాలుగా....అటు ఏపీ , ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ కేంద్రం పెద్దగా దీన్ని లెక్కలోకి తీసుకోలేదు.
ఇక తాజా ఎన్నికల తర్వాత ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కూడా అసెంబ్లీ సీట్ల పెంపుకి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం కేంద్రం... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టినట్లు వార్తాలు వచ్చాయి. సీట్ల పెంపుపై ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ, హోంశాఖలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని, దాని ప్రకారం ఏపీలో 225 సీట్లు, తెలంగాణలో 151 సీట్లకు పెరగనున్నాయని ప్రచారం జరిగింది. కానీ అది వార్తలకే పరిమితమైంది.
అయితే ఇప్పుడు జమ్మూ-కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంతో...రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల్లో ఎక్కడా లేని కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. మళ్ళీ ఎన్నికల్లోపు ఈ ప్రక్రియ పూర్తి అయితే...రాజకీయంగా మరిన్ని అవకాశాలు పెరుగుతాయి. చూడాలి మరి తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.