Begin typing your search above and press return to search.
ఏపీ ప్రజలకి శుభవార్త ..రాకపోకలకు అనుమతి అక్కర్లేదు !
By: Tupaki Desk | 23 May 2020 5:15 AM GMTఆంధ్రప్రదేశ్ లో వైరస్ నివారణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా కూడా రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ లాక్ డౌన్ నాలుగోదశ లో కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో వాటిని అమలు చేస్తున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ ను ఎన్నో సడలింపులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి రాష్ట్రంలో ఏ జిల్లా నుండి ఏ జిల్లా కి అయినా అనుమతి లేకున్నా కూడా ప్రయాణించవచ్చు అని తెలిపింది.
ఓ జిల్లాలో వ్యక్తి మరో జిల్లాకు స్వేచ్ఛగా వెళ్లవచ్చు అని, అలాగే, తమ వాహనాల్ని కూడా తీసుకెళ్లవచ్చు. ఇందుకు ఎలాంటి అనుమతి పత్రాలూ చూపించాల్సిన అవసరం లేదు. జిల్లాల సరిహద్దుల్లో వాహనాలు ఆపవద్దని ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అయితే, కారుల్లో ముగ్గురికి మించకుండా ప్రయాణించవచ్చన్నారు. అలాగే, మాస్కులు ధరించడం, సోషల్ డిస్టాన్స్ పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలవుతున్నాయని తెలిపారు
ఏపీలోని జిల్లాల మధ్య అనుమతి పత్రాలు అవసరం లేదు కానీ, తెలంగాణ సహా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి ఏపీలోకి రావాలంటే మాత్రం అనుమతి ఉండాల్సిందే. అక్కడ మాత్రం కండీషన్లు అమలవుతున్నాయి. ఓవైపు కేసులు పెరుగుతున్నా కూడా ... ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిబంధనలను సడలిస్తోంది. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 2500 దాటింది. ఏపీలో తాజాగా 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,514కు చేరింది.