Begin typing your search above and press return to search.

ఏపీ వాసులకి శుభవార్త .. కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !

By:  Tupaki Desk   |   8 Sept 2020 6:00 PM IST
ఏపీ వాసులకి శుభవార్త .. కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !
X
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ ప్రాజెక్టు రాబోతుంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఆపిల్ తన తయారీ యూనిట్ ను ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పేందుకు సన్నధం అవుతుంది. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలోని కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతంలో ఈ కంపెనీ ఏర్పాటు చేయబోతున్నట్టు , దీని ద్వారా 50 వేల మందికి ఉపాధి దొరుకుతుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

ఆపిల్ సంస్థకు చైనాలో ఆరు తయారీ యూనిట్లు ఉన్నాయని, అక్కడ ఒక్కోక్క ఫ్యాక్టరీలో 1లక్ష నుంచి 6 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారని, అదే విధంగా కడప జిల్లాలోనూ భారీ ఉత్పాదక విభాగాన్ని స్థాపించేలా ఆపిల్ సంస్థతో చర్చలు జరుపుతున్నామని మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే దాదాపుగా అన్ని పనులు ముగించామని , అంచనా వ్యయం, ఇతర వివరాలను అతి త్వరలోనే తెలుపుతామన్నారు. గత చంద్రబాబు హయాంలో చేసినట్లుగా ప్రచారం కోసం ఫేక్ ఎంవోయూలు కుదుర్చుకునే విధానాలను జగన్ సర్కారు అవలంభించబోదని, ఆయా సంస్థలతో పక్కాగా చర్చలు, ఒప్పందాలు కుదిరిదిన తర్వాతే ప్రాజెక్టులను ప్రకటిస్తున్నామని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.