Begin typing your search above and press return to search.
అవంతికి...ధర్మశ్రీలకు గుడ్ న్యూస్ ..?
By: Tupaki Desk | 19 April 2022 11:30 PM GMTఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన వైసీపీ నేతలు ఇద్దరికీ స్వయంగా జగన్ గుడ్ న్యూస్ వినిపించేశారు. జగన్ విశాఖ పర్యటనలో భాగంగా ఎయిర్ పోర్టులో తనను కలసిన నాయకులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులు జగన్ కి స్వాగతం పలికారు. మాజీ మంత్రి అయిన అవంతి శ్రీనివాసరావు, మంత్రి రేసులో చివరి దాకా ఉన్న సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు.
వారిద్దరికీ ఆయన గుడ్ న్యూస్ చెప్పేశారు. మంత్రి పదవులు రాని వారికి పార్టీ పదవులు ఇచ్చి కీలకమైన హోదాను ఇస్తామని కూడా మౌఖికంగా చెప్పేశారు. అవంతి శ్రీనివాసరావుకు విశాఖ జిల్లా వైసీపీ బాధ్యతలు, కరణం ధర్మశ్రీకి అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఇస్తున్నట్లుగా జగన్ ప్రకటించడం విశేషం.
సాధారణంగా ఇలాంటి విషయాలు జగన్ నేరుగా ఎపుడూ చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి లాంటి వారి ద్వారానే తెలుసుకుంటారు. కానీ జగన్ విశాఖ టూర్ లో భాగంగా సీనియర్ నేతలు ఇద్దరితోనూ ముఖాముఖీ మాట్లాడి పార్టీ పదవులు ఇస్తామని చెప్పడం విశేషం. దీనికి సంబంధించి పార్టీ ఉత్తర్వులు తొందరలో రానున్నాయని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మరోసారి తనకు మంత్రి పదవి ఇస్తారని ఆశపడిన అవంతికి ఆ చాన్స్ దక్కపోవడంతో కొన్ని రోజులుగా అలక పానులు ఎక్కారు. ఇక కరణం ధర్మశ్రీ వర్గీయులు అయితే మంత్రి పదవులు ప్రకటించిన రోజు రాత్రి టైర్లను కాల్చి నిరసన తెలియచేశారు. ఆ తరువాత కరణం ధర్మశ్రీ సర్దుకున్నారు, కానీ అవంతి మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉన్నారు.
ఈ నేపధ్యంలో అన్ని విషయాలు తెలుసుకున్న జగన్ తానుగానే వారికి పదవులు ప్రకటించడమే కాకుండా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా గుర్తింపు ఉంటుందన్న భరోసాను ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి అధికార పార్టీకి అధ్యక్షులుగా ఉండడం అంటే లాభమే. ఎన్నికల వేళ టికెట్ కన్ ఫర్మ్.
ఇక జగన్ ఫార్ములా ప్రకారం పార్టీ అధ్యక్షులే ఎన్నికల ముందు కీలక పాత్ర పోషిస్తారు అని తెలుస్తోంది. ఎన్నికల్లో అన్ని రకాలుగా అవసరం అయ్యే వనరులను అన్ని కూడా వారి ద్వారానే అభ్యర్ధులకు అందించాలన్నది కూడా పార్టీ ఆలోచనగా ఉంది. మొత్తానికి అధ్యక్ష పదవి అలంకారం కాకుండా దానికి మోజు ఉండేలా చేసేందుకు వైసీపీ అన్ని చర్యలు తీసుకుంటోంది.