Begin typing your search above and press return to search.

అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్.. ఇరుముడిని ఫ్లైట్ క్యాబిన్ వరకు తీసుకెళ్లొచ్చు

By:  Tupaki Desk   |   23 Nov 2022 3:58 AM GMT
అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్.. ఇరుముడిని ఫ్లైట్ క్యాబిన్ వరకు తీసుకెళ్లొచ్చు
X
ప్రతి ఏడాది దసరా ముందు నుంచి మొదలయ్యే అయ్యప్ప దీక్ష సంక్రాంతి వరకు సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేలాది మంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేరళకు వెళుతుంటారు. అయితే.. వారంతా ఎదుర్కొనే సమస్య..

దీక్ష చేసిన స్వాములు తమ వెంట ఇరుముడిని ఫ్లైట్ క్యాబిన్ లోకి తీసుకెళ్లేందుకు ఏవియేషన్ అథారిటీ అధికారులు ఒప్పుకునేవారు కాదు. సెక్యూరిటీ కారణాలతో వాటిని అనుమతించేవారు కాదు. దీంతో స్వాములు ఇబ్బందులకు గురయ్యేవారు.

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్టోబరులో జారీ చేసిన షేధాజ్ఞల జాబితాలో కొబ్బరికాయలు ఉన్నాయి. తాజాగా వాటిని తొలగిస్తూ.. నెయ్యి నింపిన కొబ్బరికాయల్ని తీసుకెళ్లేందుకు వీలుగా ఉత్తర్వులు మార్చారు. అయ్యప్ప స్వామి భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కాకినాడకు చెందిన బీజేపీ నేత ఒకరు బెంగళూరు ఎయిర్ పోర్టు సీఈవోకు తెలియజేయటంతో నిబంధనను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఒకరు తీసుకున్న చొరవ.. వేలాది మంది అయ్యప్ప స్వాములకు ఊరటను కలిగించేలా మారింది. తాజాగా తీసుకున్న నిర్ణయం అయ్యప్ప సీజన్ వరకు ఉండనుంది. ఆ తర్వాత నుంచి మళ్లీ యథావిధిగానే అమలు చేస్తారు. ఇప్పుడు కూడా అయ్యప్ప మాల వేసుకున్న స్వాములే తప్పించి.. మిగిలిన వారికి మాత్రం కొబ్బరికాయల్ని అనుమతించరు. మొత్తంగా అయ్యప్ప స్వాములకు ఊరట కలిగించేలా తాజా నిర్ణయం ఉందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.