Begin typing your search above and press return to search.
క్యాన్సర్ రోగులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్!
By: Tupaki Desk | 3 Dec 2019 6:54 AM GMTఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యం మళ్లీ స్థాపించడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయిన వైసీపీ అధినేత .. ఎన్నికల ఫలితాలలో ఏపీ చరిత్రలో ఇప్పటివరకు ఏ పార్టీకి రానటువంటి భారీ మెజారిటీ తో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిందే తడువు ..ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తూ .. వారికోసం ఎన్నో సంక్షేమ పథకాలని తీసుకువచ్చాడు. ఈ నేపథ్యంలోనే జగన్ రాష్ట్ర ప్రజానీకానికి మరో శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 5 లక్షల లోపు ఆదాయం వున్న వారందరికీ జనవరి 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ కార్డులలో ఆ వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారని , అలాగే చికిత్స ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఆరోగ్య భరోసా కార్యక్రమాన్ని సోమవారం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సభలో మాట్లాడిన సీఎం జగన్ .. ప్రభుత్వ ఆసుపత్రులకు సైతం ‘నాడు – నేడు’ వర్తింప జేయనున్నట్టు తెలిపారు. మూడు సంవత్సరాలలో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, ప్రయివేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
రాష్ట్రంలో కేన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప జేయనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో 2వేల రకాల వ్యాధులను చేరుస్తున్నట్టు ఆయన తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్య భరోసాను తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా ప శ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించి వచ్చే ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాలకు విస్తరించనున్నట్టు ఆయన చెప్పారు. వచ్చే ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 1,060 నూతన 104, 108 వాహనాలను కొనుగోలు చేస్తామన్నారు. ఫోన్ చేసిన 20 నిమిషాల వ్యవధిలోనే రోగి వద్దకు అంబులెన్స్ చేర్చేలా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ఆసుపత్రులలో కాక పక్క రాష్ట్రాలు అయిన హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాలలో 130కి పైగా ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ పధకం వర్తింప చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.