Begin typing your search above and press return to search.

వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ.. శుభవార్త చెప్పిన జగన్

By:  Tupaki Desk   |   15 Nov 2019 9:53 AM GMT
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ.. శుభవార్త చెప్పిన జగన్
X
వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. పదేళ్ల టీడీపీ పాలనకు చరమగీతం పాడి మళ్లీ పదేళ్ల పాటు చంద్రబాబు ను ప్రతిపక్షం లో కూర్చుండబెట్టిన నేత. వైఎస్ అమలు చేసిన ఆరోగ్య శ్రీ, విద్యార్థుల కు స్కాలర్ షిప్ సహా చాలా పథకాలు ఇప్పటికీ అమలు అవుతున్నాయంటే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. తెలుగు ప్రజల మదిలో సంక్షేమ పథకాల తో చెరగని ముద్ర వేసిన వైఎస్ బాటలోనే ఇప్పుడు జగన్ నడుస్తున్నారు.

అందుకే వైఎస్ జగన్ ఏపీకి సీఎం కాగానే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. తాజాగా ఈ పథకాన్ని రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి కూడా వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ’ పథకం కొత్త మార్గ దర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

*అన్ని రకాల బియ్యం కార్డులు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు
*వైఎస్ఆర్ పెన్షన్, జగనన్న విద్యావసతి దీవెన కార్డులున్న కుటుంబాలు కూడా అర్హులే..
*పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోని 130 ఆస్పత్రుల్లో వైఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది.
* కుటుంబం లో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులు గా తెలిపిన ప్రభుత్వం
*కుటుంబం లో ఒక కారు ఉన్నా వైఎస్సాఆర్ ఆరోగ్య శ్రీ వర్తింపు
* ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ.. గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు అర్హులు
*12 ఎకరాల మాగాణి, 35 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్న వారు అర్హులు
* 334 చదరపు అడుగులుకన్నా తక్కువ ప్రాంతానికి మునిసిపల్ ఆస్తి పన్ను చెల్లించే కుటుంబాలకు వర్తింపు
* మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారందరూ అర్హులు
* 5.00 లక్షలోపు వార్షిక ఆదాయం, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, అర్హులు
**వార్షిక ఆదాయం 5 లక్షల వరకు ఉన్న వారు అర్హులు
* 5.00 లక్షల వరకు ఆదాయపు పన్ను దాఖలు చేస్తున్న కుటుంబాలు అర్హులు