Begin typing your search above and press return to search.

రైతులు - మిల్లర్లకు తీపి కబురు: వినియోగదారులకు చేదువార్త

By:  Tupaki Desk   |   19 Jun 2020 1:09 PM GMT
రైతులు - మిల్లర్లకు తీపి కబురు: వినియోగదారులకు చేదువార్త
X
చక్కెరకు కనీస విక్రయ ధర (ఎంఎస్‌పీ)ను పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు ఆహార మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో చక్కెర మిల్లర్లకు, రైతులకు సహాయంగా ఉండేందుకు ప్రస్తుతం కిలో చక్కెరకు రూ.31గా ఉన్న ధరను పెంచనున్నట్టు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదర్శన్‌ పాండే ప్రకటించారు. చెరుకు రైతులకు మిల్లర్లు రూ.22 వేల కోట్లు బకాయిలను చెల్లించాల్సి ఉన్నది.

కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే.. చెరుకు రైతులకు ఉపకరిస్తుంది. విక్రయ ధరను పెంచడంతో పాటు, లాక్ డౌన్ తో సంక్షోభంలో చిక్కుకున్న చక్కెర పరిశ్రమకు బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

దేశంలో అత్యధికంగా చక్కెరను ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర ఉన్నాయి. ఈ డిమాండ్ ను ఆ రాష్ట్రాలు తెరమీదికి తీసుకొచ్చాయి. వీటితో పాటు కొంతకాలంగా చెరుకు విక్రయ ధరను పెంచాలని సహకార చక్కెర మిల్లుల ఫెడరేషన్ లిమిటెడ్ డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌ను పరిశీలించిన కేంద్రం.. రైతులు, మిల్లర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ధర పెంపుతో రైతులు, మిల్లర్లకు మేలు కలగనుండగా మార్కెట్ లో చక్కెర ధర పెరగడంతో ప్రజలకు భారం కానుంది. దీంతో వారికి చేదు వార్త అవుతుంది.