Begin typing your search above and press return to search.
మెట్రో ప్రయాణికులకి శుభవార్త... మూడు నిమిషాలకో రైలు
By: Tupaki Desk | 16 Aug 2019 8:40 AM GMTహైదరాబాద్ నగరంలోని మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికులకి మెట్రోని మరింత దగ్గర చేసే భాగంగా ప్రతి మూడు నిమిషాలకో రైలుని నడపనున్నారు. ఇప్పటికే మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ కి పీక్ అవర్స్ లో ప్రతి మూడు నిమిషాలకో ట్రైన్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయిట్ ఐటీ ఉద్యోగులు ఎక్కువగా వెళ్ళే హైటెక్ సిటీ వైపు ఈ సదుపాయం లేదు.
జూబ్లీ చెక్ పోస్ట్–హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు రివర్సల్ సదుపాయం లేకపోవడంతో మొన్నటి వరకు 8 నిమిషాలకో రైలు నడిపారు. కానీ ఇప్పుడు రివర్సల్ సదుపాయం రావడంతో పీక్ అవర్స్ లో 3 నిమిషాలు, నాన్ పీక్ అవర్స్ లో 5 నిమిషాలకో రైలు అందుబాటులోకి రానుంది. కాగా, ప్రతివారం సరాసరిన మెట్రో ప్రయాణికుల సంఖ్యలో 5 నుంచి 6 వేల మేర పెరుగుదల ఉంటుంది.
ప్రస్తుతం మెట్రో ప్రయాణికుల సంఖ్య 3.06 లక్షలకు చేరుకోగా, స్టేషన్లలో రద్దీని కలిపితే ప్రయాణికుల సంఖ్య 3.23 లక్షల వరకు ఉంది. ప్రస్తుతం ఎల్బీనగర్–మియాపూర్- నాగోల్–హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అలాగే ఇప్పుడు హైటెక్ సిటీ-రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ మెట్రో పనులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరులో ఈ మార్గంలో మెట్రో ట్రయల్ రన్ నిర్వహించనుంది.
అలాగే ఎంజీబీఎస్–జేబీఎస్ మార్గంలో ఈ ఏడాది చివరికల్లా మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ మార్గంలో ఇప్పటికే మెట్రో పనులు, స్టేషన్లు, సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్స్, విద్యుదీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహించి , ఏడాది డిసెంబర్ లో మెట్రోని పరుగులు పెట్టించనున్నారు.