Begin typing your search above and press return to search.

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   6 Feb 2020 11:30 AM GMT
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్
X
రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తో బాధపడుతున్న హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. నగరంలో చేపట్టిన 72 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మాణం దాదాపుగా పూర్తవుతుంది. దశలవారీగా మెట్రో రైల్ నిర్మాణం అందుబాటులోకి వస్తోంది. తాజాగా మరో మార్గం ప్రజలకు చేరువ కానుంది. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మెట్రో మార్గం పూర్తయ్యింది. దీంతో ఫిబ్రవరి 7వ తేదీన సీఎం కేసీఆర్‌ ఈ మెట్రో మార్గాన్ని ప్రారంభిస్తారరని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. ట్రాఫిక్‌ సమస్య కారణంగా ఈ మార్గంలో ప్రయాణానికి దాదాపుగా 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. అదే మెట్రో రైలు అందుబాటులోకి వస్తే.. కేవలం 15 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు సంస్థ వివరించింది. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్‌ సమస్య తీరనుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

11 కిలో మీటర్లు ఈ మార్గం ఉంది. ఈ మెట్రో మార్గం పూర్తితో హైదరాబాద్ లో మొత్తం మెట్రో రైల్ 69 కిలో మీటర్లు పూర్తి చేసునుంది. జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గంలో మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్- పరేడ్ గ్రౌండ్ స్టేషన్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్.

అయితే హైదరాబాద్ మెట్రో రైలు ఎన్నో ప్రత్యేకతలు సొంతం చేసుకుంటోంది. ఢిల్లీ తర్వాత అతి పెద్ద మెట్రో రైలు మార్గం కలిగిన రెండో నగరంగా హైదరాబాద్ పేరొందింది. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని తాజా ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. ఎప్పుడో పూర్తి కావాల్సిన మెట్రో ఆపసోపాలు పడుతూ ఇన్నాళ్లకు పూర్తవుతుంది. ఇంకా ఎబీబీఎస్- ఫలక్ నుమా మార్గం పూర్తవుతే హైదరాబాద్ మెట్రో రైల్ సంపూర్ణం గా పూర్తవుతుంది. ఈ పనుల ఆలస్యం పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మెట్రో అధికారులను ట్విటర్ లో నిలదీశారు. మరి ఆ పనులు కూడా పూర్తి చేసి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. రెండో దశ విస్తరణలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం, ఇతర మార్గాలు, పాతబస్తీ మెట్రో పై సీఎం కేసీఆర్ ప్రకటనలు చేసే అవకాశం ఉంది.