Begin typing your search above and press return to search.
ఉక్రెయిన్ లోని భారతీయులకు గుడ్ న్యూస్
By: Tupaki Desk | 17 Feb 2022 9:30 AM GMTరష్యా, ఉక్రెయిన్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ లోని భారత పౌరులు, విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతోన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థులు, భారత పౌరులు తక్షణమే స్వదేశానికి వచ్చేయాలని భారత్ పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ లోని అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో వారు తమ ఉనికిని ఎప్పటికప్పుడు ఎంబసీకి సమాచారమివ్వాలని చెప్పింది.
దీంతో, భారత్ కు రావడానికి విద్యార్థులు, పౌరులు సిద్ధమయ్యారు. కానీ, ఒక్కసారిగా ఉక్రెయిన్ నుంచి భారత్ కు విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరిగింది. కానీ, అందుకు తగ్గట్లు సరిపడినన్ని విమాన సర్వీసులు లేకపోవడం, ఉక్రెయిన్ వెళ్లే విమానాలపై కొన్ని ఆంక్షల నేపథ్యంలో ఫ్లైట్ టికెట్ల రేట్లు ఆకాశాన్నంటాయి.
దీంతో, తాజాగా భారత పౌరవిమానయాన శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్, ఉక్రెయిన్ మధ్య విమానాల్లో ఎయిర్ బబుల్ ఆంక్షలను ఎత్తివేసినట్లు ఆ శాఖ ప్రకటించింది.
అంతేకాదు, ఆ దేశం వెళ్లే విమానాల పరిమితి, సీటింగ్ విషయంలోనూ గతంలో విధించిన పలు ఆంక్షలు ఎత్తివేసింది.
అధిక సంఖ్యలో విమానాలు, చార్టెడ్ ఫ్లైట్లు నడపవచ్చని ఆదేశాలు జారీ చేసింది. డిమాండ్ కు సరిపడా వీలైనన్ని విమానాలు నడపాలని నిర్ణయించుకున్నామని ఆ శాఖ తెలిపింది. విమానాల సంఖ్య తక్కువగా ఉందని భారత రాయబార కార్యాలయానికి వచ్చిన వినతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.
మరోవైపు, రష్యా, ఉక్రెయిన్ ల మధ్య దౌత్య పరంగా చర్చలు సానుకూల ఫలితాలనిస్తున్నాయి. దీంతో, ఉక్రెయిన్ సరిహద్దు నుంచి రష్యా తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. ఉక్రెయిన్ లో ఉద్రిక్తతలు సద్దుమణగడంతో భారత్ విధించిన ఆంక్షలు ఎత్తేసింది. అంతకుముందు, ఉక్రెయిన్ విషయంలో దౌత్యపరమైన చర్చలు జరపాలని, అలా కాకుండా బలవంతంగా ఆక్రమించుకోవాలని చూస్తే ఊరుకోబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.