Begin typing your search above and press return to search.

హెచ్1బీ వీసాపై భారతీయులకు గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   21 Aug 2021 4:30 PM GMT
హెచ్1బీ వీసాపై భారతీయులకు గుడ్ న్యూస్
X
అమెరికాకు వెళ్లడం భారతీయుల కల. అక్కడ ఉద్యోగం చేయడం వారి అభిరుచి. ఆ కలను అనాదిగా నెరవేర్చుకుంటున్నారు. అయితే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక భారతీయులే కాదు.. విదేశీయులకు తలుపులు మూసేసి వెళ్లగొట్టారు.అయితే అక్కడ ఇటీవల జరిగిన ఎన్నికల్లో జోబైడెన్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆంక్షలు ఎత్తివేసి విదేశీ నిపుణులకు పెద్దపీట వేశాడు.

తాజాగా హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులకు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తీపికబురునందించాడు. అమెరికా ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి భారతీయ నిపుణులకు హెచ్1బీ వీసాలు జారీ చేసేందుకు అంగీకరించిందని తెలిపారు. అలాగే ఇతర యూఎస్ వీసాల జారీని అగ్రరాజ్యం ఈ ఏడాది చివరి వరకు ప్రారంభించనుందని పేర్కొన్నారు.

హెచ్1బీ వీసా అనేది అమెరికన్ కంపెనీలకు వివిధ రంగాల్లో నైపుణ్యత గల విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీని ద్వారా భారతీయులే అధికంగా లబ్ధి పొందుతున్నారు. అమెరికా ప్రతీఏటా 65వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంది. అలాగే మరో 20వేల వీసాలను అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశీ విద్యార్థులకు ఇస్తుంటుంది.

ప్రస్తుతం అమెరికా స్టూడెంట్ వీసాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.అమెరికాతోపాటు పశ్చిమ ఐరోపా దేశాలు ప్రస్తుతం భారత విద్యార్థులు వీసాలు జారీ చేస్తున్నాయని.. ఎంఈఏ ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తోందని చెబుతున్నారు.

ఇక భారతీయ విద్యార్థులకు వీసాల జారీలో జాప్యం రాకుండా ఆస్ట్రేలియన్ మిషన్ తో ఎంఈఏ సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు.