Begin typing your search above and press return to search.
ఐటీ చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
By: Tupaki Desk | 24 July 2019 7:13 AM GMTఆదాయపు పన్ను చెల్లింపుదారులకు శుభవార్త అందింది. 2018-19 సంవత్సరానికి ఆదాయపు పన్ను(ఐటీ) రిటర్నులు దాఖలు చేయడానికి ఇన్నాళ్లు జూలై 31 వరకు మాత్రమే గడువు విధించింది కేంద్రం. లేకపోతే ఆదాయాన్ని బట్టి 10వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీంతో ఉద్యోగులంతా ఉరుకులు, పరుగులు తీశారు. అయితే అందరికీ స్వాంతన చేకూరుస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది.
ఐటీ రిటర్నులు సమర్పించడానికి గడువు తేదీని ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది. అంటే ఆగస్టు 31వరకు దాఖలు చేయడానికి సమయం ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా వివిధ కేటగిరిల్లో ఉన్న 25వేల ఆదాయం మించిన పన్ను చెల్లింపుదారులందరూ ఆగస్టు 31లోగా రిటర్నులు సమర్పించాలని అందులో పేర్కొన్నారు.
ఈసారి ఎన్నికలు జరగడం.. బడ్జెట్ లేటుగా ప్రవేశపెట్టడం.. ఆర్థిక సంవత్సరం ముందుకు జరగడంతో అందరూ ఐటీఆర్ గడువు తేదీని పెంచాలని డిమాండ్ చేశారు.. ఈ నేపథ్యంలో కేంద్రం ఒక నెల అదనపు గడువును పెంచింది.
ఇక డిసెంబర్ 31 వరకు ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు రూ.5వేలు, ఆ తర్వాత రిటర్నులు దాఖలు చేయడానికి మార్చి 31 వరకు గడువు తీసుకుంటే 10వేల చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఐటీ రిటర్నులు చివరి రోజు వరకు ఆగకుండా వెంటనే చేయాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు కోరుతున్నారు.