Begin typing your search above and press return to search.

వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్ః టోల్ గేట్లు ఎత్తేస్తున్న కేంద్రం!

By:  Tupaki Desk   |   18 March 2021 5:30 PM GMT
వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్ః టోల్ గేట్లు ఎత్తేస్తున్న కేంద్రం!
X
టోల్ గేట్ వ‌ద్ద చెల్లించాల్సిన డ‌బ్బుల‌క‌న్నా.. అక్క‌డ వెయిట్ చేయాల్సిన స‌మ‌య‌మే వాహ‌న‌దారుల‌ను ఎక్కువ‌గా ఇబ్బంది పెడుతుందంటే అతిశ‌యోక్తి కాదు. సాధార‌ణ స‌మ‌యాల్లోనే కిక్కిరిసిపోయే ప్ర‌ధాన టోల్ ప్లాజాలు.. పండ‌గ లాంటి ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో కిలోమీట‌ర్ల మేర బారులు తీరుతాయి. అయితే.. ఇక‌పై ఇలాంటి బాధ‌లు ఉండ‌వ‌ని, టోల్ గేట్లు మొత్తం ఎత్తేయ‌బోతున్నామ‌ని కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

రాబోయే ఏడాది కాలంలో దేశంలోని అన్ని టోల్ గేట్ల‌ను ఎత్తేస్తామ‌ని ర‌వాణాశాఖ మంత్రి వెల్ల‌డించారు. ఈ మేర‌కు పార్ల‌మెంటులో నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ టోల్ గేట్ల వ‌ద్ద ఫాస్ట్ టాగ్ ద్వారా టోల్ ఫీజు చెల్లిస్తున్నారు చాలా మంది వాహ‌న‌దారులు. కొంద‌రు మాత్రం మామూలు ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తున్నారు. అయితే.. ప్ర‌యాణాన్ని మ‌రింత సుభ‌త‌రం చేసేందుకు టోల్ గేట్లు ఎత్తేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మంత్రి తెలిపారు.

ఇక మీద‌ట జీపీఎస్ ప‌ద్ధ‌తిలో ఫీజు వ‌సూలు చేప‌ట్ట‌నున్న‌ట్ట వెల్ల‌డించారు. ఈ విధానం ద్వారా వాహ‌న‌దారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా డ‌బ్బులు విత్ డ్రా అవుతాయ‌ని చెప్పారు. అంతేకాకుండా.. వాహ‌న‌దారులు ఎక్క‌డి వ‌ర‌కు తిరిగితే అక్క‌డి వ‌ర‌కే డ‌బ్బులు చెల్లించొచ్చ‌ని, టోల్ గేట్ల వ‌ద్ద ఆగాల్సిన ప‌ని లేద‌ని అన్నారు మంత్రి.