Begin typing your search above and press return to search.

కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ

By:  Tupaki Desk   |   12 March 2020 7:36 AM GMT
కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ
X
ప్రభుత్వరంగంలోని అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. అకౌంట్ హోల్డర్స్ తమ పొదుపు ఖాతాల్లో ఉంచవలసిన నెలవారీ సగటు నిల్వ నిబంధనను ఎస్‌బీఐ ఎత్తివేసింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు ఇది వర్తించనుంది. దీంతో కోట్ల మంది కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది. స్టేట్ బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లపై మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు ఎత్తివేయడం వల్ల 44.51 కోట్ల మంది కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది.

ప్రస్తుతం ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాంక్ కస్టమర్లు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సి ఉంది. దీంతో చాలా మంది ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రో నగరాల్లో బ్యాంక్ అకౌంట్ కలిగిన కస్టమర్లకు మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ రూ.3,000గా ఉంది. అదే పట్టణాల్లో ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్లకు మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ రూ.2,000గా ఉంది. చివరగా గ్రామీణ ప్రాంతాల్లోని అకౌంట్లకు మినిమమ్ బ్యాలెన్స్ రూ.1,000 గా నిర్దేశించింది. నెలవారీగా సగటు నిల్వ లేని పక్షంలో కస్టమర్లకు రూ.5 నుంచి రూ.15 వరకు బ్యాంకు జరిమానా విధిస్తూ వచ్చింది. దీనిపై పన్నును కూడా వసూలు చేసింది. ఎస్‌బీఐ కేవలం మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు మాత్రమే కుకాండా ఎస్ ఎం ఎస్ చార్జీలను తొలగిస్తున్న ప్రకటించింది.

ఈ నిర్ణయంతో బ్యాంక్ కస్టమర్లకు మరింత ప్రయోజనం కలుగనుంది. ఎస్‌ బీఐ బ్యాంక్ చైర్మన్ రజ్‌నీష్ కుమార్ మాట్లాడుతూ.. బ్యాంక్ కస్టమర్లకు ఎక్కువ ప్రయోజనం కలిగించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎస్‌ బీఐ 2017 ఏప్రిల్‌ నుంచి కనీస నిల్వ చార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం లో బ్యాంక్‌ కనీస నిల్వ పెనాల్టీగా కస్టమర్ల నుంచి రూ.2,400 కోట్లకు పైగా వసూలు చేసింది.